Runner-up Trophy
-
రన్నరప్ సానియా మీర్జా జంట
క్లీవ్‌ల్యాండ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో సానియా మీర్జా (భారత్)–క్రిస్టినా మెకేల్ (అమెరికా) జంట రన్నరప్ ట్రోఫీతో సంతృప్తి పడింది. ఆదివారం అమెరికాలోని ఒహాయోలో జరిగిన ఫైనల్లో సానియా–క్రిస్టినా ద్వయం 5–7, 3–6తో టాప్ సీడ్ సుకో అయోమా–ఎనా షిబహారా (జపాన్) జోడీ చేతిలో ఓడిపోయింది. రన్నరప్‌గా నిలిచిన సానియా జోడీకి 6,000 డాలర్ల (రూ. 4 లక్షల 40 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 180 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
రన్నరప్ ప్రాంజల జంట
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల సర్క్యూట్ టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల ఆకట్టుకుంది. నవీ ముంబైలో జరిగిన ఈ టోర్నీలో డబుల్స్ విభాగంలో ఆమె రన్నరప్‌గా నిలిచింది. టైటిల్ పోరులో ప్రాంజల (భారత్)–తమారా జిదాన్సెక్ (స్లొవేనియా) ద్వయం 0–6, 1–6తో రెండో సీడ్ జార్జినా గార్సియా పెరెజ్ (స్పెయిన్)–డయానా మార్సింకెవికా (లాత్వియా) జంట చేతిలో పరాజయం పాలైంది. అంతకుముందు సెమీస్‌లో ప్రాంజల జోడీ 6–4, 2–6, 13–11తో టాప్ సీడ్ ఓల్గా డోరోషినా (రష్యా)–పొలినా మోనోవా (రష్యా) జంటపై విజయం సాధించింది. -
రన్నరప్ సానియా జంట
స్టట్గార్ట్ (జర్మనీ): ఈ సీజన్లో ఐదో డబుల్స్ టైటిల్ సాధించాలని ఆశించిన సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంటకు నిరాశ ఎదురైంది. ఆదివారం ముగిసిన పోర్షె టెన్నిస్ గ్రాండ్‌ప్రి టోర్నమెంట్లో ఈ ఇండో-స్విస్ ద్వయం రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. 81 నిమిషాలపాటు జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ జంట 6-2, 1-6, 6-10తో ‘సూపర్ టైబ్రేక్’లో రెండో సీడ్ కరోలినా గార్సియా-క్రిస్టినా మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్) జోడీ చేతిలో ఓడిపోయింది. రన్నరప్‌గా నిలిచిన సానియా జంటకు 17,459 యూరోల (రూ. 13 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 305 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ ఏడాది సానియా-హింగిస్ జంట బ్రిస్బేన్ , సిడ్నీ, ఆస్ట్రేలియన్ ఓపెన్, సెయింట్ పీటర్స్బర్గ్ ఓపెన్ టోర్నమెంట్లలో టైటిల్ సాధించింది.