పోరాడి ఓడిన ప్రాంజల | Pranjala Yadlapalli gets out from pre quarters of ITF Womens Tourney | Sakshi
Sakshi News home page

పోరాడి ఓడిన ప్రాంజల

Published Thu, Jun 7 2018 10:27 AM | Last Updated on Thu, Jun 7 2018 10:27 AM

Pranjala Yadlapalli gets out from pre quarters of ITF Womens Tourney - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) మహిళల టెన్నిస్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల పోరాటం ముగిసింది. థాయ్‌లాండ్‌లోని హువా హిన్‌ నగరంలో జరుగుతున్న ఈ టోర్నీలో ప్రాంజల సింగిల్స్‌లో ప్రిక్వార్టర్‌ ఫైనల్లో... డబుల్స్‌లో క్వార్టర్‌ ఫైనల్లో ఓటమి పాలైంది. ఆరో సీడ్‌ జాక్వలైన్‌ కాకో (అమెరికా)తో జరిగిన సింగిల్స్‌ మ్యాచ్‌లో ప్రాంజల 6–4, 3–6, 4–6తో పోరాడి ఓడింది.

2 గంటల 17 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రాంజల మూడు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది. తన సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్‌ చేసింది. డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో ప్రాంజల–తమాచాన్‌ (థాయ్‌లాండ్‌) ద్వయం 6–4, 6–7 (5/7), 10–12తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో నిచా–నుద్‌నిదా (థాయ్‌లాండ్‌) జంట చేతిలో పరాజయం పాలైంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement