తెలుగు అమ్మాయికి అరుదైన అవకాశం | Pranjala Yadlapalli selected in ITF Touring team | Sakshi
Sakshi News home page

తెలుగు అమ్మాయికి అరుదైన అవకాశం

Published Wed, May 6 2015 6:39 PM | Last Updated on Sun, Sep 3 2017 1:33 AM

తెలుగు అమ్మాయికి అరుదైన అవకాశం

తెలుగు అమ్మాయికి అరుదైన అవకాశం

న్యూఢిల్లీ: టెన్నిస్ లో నిలకడగా రాణిస్తున్న తెలుగమ్మాయి యడ్లపల్లి ప్రాంజల మరో మెట్టు ఎక్కింది. ఐటీఎఫ్ టూరింగ్ టీమ్ లో ఆమె చోటు దక్కించుకుంది. వచ్చే మూడు నెలల కాలంలో ఈ టీమ్ యూరప్ లో పలు జూనియర్ టెన్నిస్ టోర్నమెంట్లలో ఆడుతుంది. ఈ టీమ్ కు ఐటీఎఫ్, గ్రాండ్ స్లామ్ డెవలప్ మెంట్ ఫండ్ ఆర్థిక సహాయం అందిస్తున్నాయి.

ఐటీఎఫ్ టూరింగ్ టీమ్ లో చోటు దక్కడం పట్ల ప్రాంజల సంతోషం వ్యక్తం చేసింది. యూరప్ పర్యటన తన కెరీర్ కు ఎంతో కీలమని తెలిపింది. హైదరాబాద్ లోని చిన్మయ విద్యాలయలో 12వ తరగతి చదువుతున్న జీవీకే టెన్నిస్ అకాడమీలో శిక్షణ తీసుకుంది. 12 మంది సభ్యుల ఐటీఎఫ్ టూరింగ్ టీమ్ కు ఈ నెల 8 నుంచి 10 వరకు ఇటలీలో ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement