పృథ్వీ షా
రాజ్‌కోట్: వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇక్కడ జరుగుతున్న మొదటి మ్యాచ్ ద్వారా టీమిండియా తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన పృథ్వీ షా అదుర్స్ అనిపించాడు. 99 బంతుల్లో 15 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకుని తన బ్యాటింగ్ పవర్ చూపించాడు. దాంతో భారత్ తరుపున ఆడుతున్న తొలి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించిన పిన్నవయస‍్కుడిగా షా రికార్డు నెలకొల్పాడు. పృథ్వీ షా 18 ఏళ్ల 329 రోజుల వయసులోనే టెస్టుల్లో అరంగేట్రం చేయడమే కాకుండా సెంచరీతో మెరిశాడు. మరొకవైపు పిన్న వయసులోనే తొలి టెస్టు సెంచరీ సాధించిన రెండో భారత ఆటగాడిగా గుర్తింపు పొందాడు. అంతకుముందు సచిన్ టెండూల‍్కర్ 17 ఏళ్ల 112 రోజుల వయసులో తొలి టెస్టు సెంచరీ సాధించాడు.
మరొకవైపు టెస్టు అరంగేట్రంలో ఫాస్టెస్ సెంచరీ సాధించిన మూడో ఓవరాల్ క్రికెటర్‌గా షా గుర్తింపు సాధించాడు. శిఖర్ ధావన్ 85 బంతుల్లో ఆసీస్‌పై సెంచరీ సాధించగా, డ్వేన్ స్మిత్ 93 బంతుల్లో శతకం సాధించిన ఆటగాడు. ఇక అరంగేట్రం మ్యాచ్‌లో సెంచరీ సాధించిన నాల్గో పిన్నవయస‍్కుడిగా షా నిలిచాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా ముందుగా బ్యాటింగ్ తీసుకుంది. అయితే ఆరంభంలోనే టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. పృథ్వీ షాతో కలిస ఇన్నింగ్స్ ఆరంభించిన కేఎల్ రాహుల్ డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. తొలి ఓవర్‌లోనే గాబ్రియేల్ బౌలింగ్‌లో రాహుల్ వికెట్లు ముందు దొరికిపోయాడు. అటు తర్వాత పుజారాతో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లిన పృథ్వీ షా తన సహజసిద్ధమైన ఆట తీరుతో అలరించాడు.పుజారాతో కలిసి అజేయంగా 180కు పైగా పరుగుల భాగస్వామ్యాన్ని జత చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment