
తలైవాస్‌పై పట్నా పైచేయి
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 35–24తో తమిళ్ తలైవాస్‌ను చిత్తు చేసింది. ఆరంభం నుంచే పట్నా ఆటగాళ్లకు తలైవాస్ ఏమాత్రం పోటీనివ్వలేకపోయింది. మోను 11, అజయ్ ఠాకూర్ 10 రైడింగ్ పాయింట్లతో విజయంలో కీలకంగా నిలిచారు. మరో మ్యాచ్‌లో పుణేరి పల్టన్ 26–24 తేడాతో యు ముంబాపై గెలిచింది.