
డర్బన్: ఓపెనర్ క్వింటన్ డి కాక్ (108 బంతుల్లో 121; 16 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ సాధించడంతో... శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో దక్షిణాఫ్రికా డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 71 పరుగుల తేడాతో గెలిచింది. వరుసగా మూడో విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే 3–0తో సొంతం చేసుకుంది.
తొలుత దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో ఐదు వికెట్లకు 331 పరుగులు చేసింది. డసెన్ (50), మిల్లర్ (41 నాటౌట్) రాణించారు. అనంతరం వర్షం రావడంతో శ్రీలంక లక్ష్యాన్ని 24 ఓవర్లలో 193 పరుగులుగా నిర్దేశించారు. అయితే శ్రీలంక 24 ఓవర్లలో ఐదు వికెట్లకు 121 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది.