న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెపె్టన్ రాహుల్ ద్రవిడ్ గురువారం బీసీసీఐ ఎథిక్స్ అధికారి జస్టిస్ డీకే జైన్ ఎదుట హాజరయ్యాడు. ద్రవిడ్ ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) డైరెక్టర్‌గా, ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యంలోని ఇండియా సిమెంట్స్ సంస్థ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశమై వివరణ ఇచ్చేందుకు జస్టిస్ జైన్ ముందుకు వచ్చాడు. విచారణ సందర్భంగా అతడిని ఇండియా సిమెంట్స్ పదవి నుంచి తప్పుకోమని కోరే వీలున్నట్లు ముందుగా భావించారు. అయితే, దీనికి ముందే ఓ వ్యక్తి ఒక సంస్థ ఉద్యోగానికి సెలవు పెట్టి మరో పదవిని చేపట్టడం విరుద్ధ ప్రయోజనాల పరిధిలోకి రాదని పేర్కొంటూ ఎథిక్స్ అధికారికి క్రికెట్ పాలకుల కమిటీ (సీఓఏ) చీఫ్ వినోద్ రాయ్ నోట్ పంపారు.
Comments
Please login to add a commentAdd a comment