తిరువనంతపురం: గత కొంతకాలంగా పేలవ ఫామ్‌లో ఉన్న భారత ఆటగాడు కేఎల్ రాహుల్‌కు దిగ్గజ ఆటగాడు, భారత -ఎ జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ మద్దతుగా నిలిచాడు. కేఎల్ రాహుల్ తిరిగి సత్తాచాటుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ మేరకు మూడు ఫార్మాట్లలో శతకాలు చేసిన క్రికెటర్ కేఎల్ రాహుల్ అని గుర్తు చేశాడు. దాంతో అతని ఫామ్ గురించి తనకు ఎటువంటి ఆందోళన లేదన్నాడు.
‘కేఎల్ రాహుల్ బ్యాటింగ్ సామర్థ్యం, నాణ్యతపై నాకు విశ్వాసముంది. అతడు నాలుగు రోజుల మ్యాచ్‌లు ఆడుతున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో మూడు ఫార్మాట్లలోనూ సత్తా చాటాడు. వన్డే, టెస్టు, టీ20ల్లో అతడికి శతకాలు ఉన్నాయి. అతడి ఫామ్ గురించి నేను ఆందోళన చెందడం లేదు’ అని ద్రవిడ్ అన్నారు. ప్రస్తుతం భారత్-ఎ జట్టు తరుఫున రాహుల్ ఆడుతున్నాడు.
ఇటీవల ఓ టీవీ షో మహిళలపై కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యాలు అసభ్యకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం సస్పెన్షన్‌కు గురైన వీరిద్దరూ కొన్ని రోజులు క్రికెట్‌కు దూరమయ్యారు. కాగా, వీరిపై విచారణ కొనసాగిస్తూనే బీసీసీఐ సస్పెన్షన్ ఎత్తి వేయడంతో తిరిగి క్రికెట్ ఆడుతున్నారు. కివీస్‌తో సిరీస్‌కు హార్దిక్‌కు చోటు దక్కగా, భారత్-ఎ జట్టు తరఫున రాహుల్ ఆడుతున్నాడు. ఇంగ్లండ్ లయన్స్‌తో జరుగుతున్న అనధికారిక ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా రెండు రోజుల క్రితం జరిగిన ఐదో వన్డేలో రాహుల్ పరుగులేమీ చేయకుండా నిష్క్రమించాడు.
Comments
Please login to add a commentAdd a comment