రేపటి నుంచి ఆస్ట్రేలియా ‘ఎ’తో భారత్ ‘ఎ’ రెండో అనధికారిక టెస్టు
మెల్‌బోర్న్: టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్‌ను ఒత్తిడిలోనే ఉంచే ప్రయత్నం చేస్తామని... ఆస్ట్రేలియా పేసర్ స్కాట్ బోలాండ్ అన్నాడు. భారత్, ఆస్ట్రేలియా మధ్య ఈ నెల 22 నుంచి ఐదు మ్యాచ్‌ల ‘బోర్డర్–గావస్కర్’ టెస్టు సిరీస్ ప్రారంభం కానుండగా... ప్రస్తుతం భారత ‘ఎ’ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఆ్రస్టేలియా ‘ఎ’తో భారత ‘ఎ’ జట్టు ఒక అనధికారిక టెస్టు ఆడి ఓడిపోగా... రెండో మ్యాచ్ గురువారం నుంచి ప్రారంభం కానుంది.
ఈ మ్యాచ్‌లో ఆడేందుకు రాహుల్‌తో పాటు వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ ముందుగానే ఆ్రస్టేలియాలో అడుగు పెట్టారు. ఇటీవలి కాలంలో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న రాహుల్... ‘బోర్డర్–గావస్కర్’ ట్రోఫీ సిరీస్‌కు ముందు ఈ మ్యాచ్‌లో సత్తా చాటాలని పట్టుదలతో ఉన్నాడు. తాజాగా న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో మాత్రమే ఆడి తర్వాత తుది జట్టులో చోటు కోల్పోయిన రాహుల్... బోర్డర్–గావస్కర్ సిరీస్‌లోని మొదటి టెస్టు కోసం తుది జట్టులో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాలరీత్యా తొలి టెస్టుకు అందుబాటులో లేకపోతే టీమ్ మేనేజ్‌మెంట్ రాహుల్‌కే తొలి ప్రాధాన్యత ఇస్తుంది. ఈ నేపథ్యంలో బోలాండ్ మాట్లాడుతూ.. ‘గతంలో రాహుల్‌కు బౌలింగ్ చేసిన అనుభవం ఉంది. మళ్లీ ఇన్ని రోజుల తర్వాత స్వదేశంలో అతడికి బౌలింగ్ చేయనున్నా. అతడు ప్రపంచ స్థాయి ప్లేయర్. అతడిని ఒత్తిడిలో ఉంచేందుకు ప్రయత్నిస్తాం’ అని అన్నాడు. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో ఓడినంత మాత్రాన టీమిండియాను తక్కువ అంచనా వేయడం లేదని బోలాండ్ పేర్కొన్నాడు.
‘ఇక్కడి పిచ్‌లపై బౌన్స్ ఎక్కువ ఉంటుంది. ఆ్రస్టేలియా పర్యటన కోసం టీమిండియా జట్టును ఎంపిక చేసుకునే విధానం భారత్‌తో పోలిస్తే పూర్తి భిన్నంగా ఉంటుంది’ అని అన్నాడు. 2015లో తొలిసారి ఆ్రస్టేలియాలో పర్యటించిన రాహుల్... సిడ్నీ టెస్టులో సెంచరీతో ఆకట్టుకున్నాడు. గత ఏడాది డిసెంబర్‌లో సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాపై చివరిసారి సెంచరీ చేసిన రాహుల్... ఆ తర్వాత 9 ఇన్నింగ్స్‌ల్లో కేవలం రెండు అర్ధశతకాలు మాత్రమే నమోదు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment