రంగారెడ్డి, హైదరాబాద్‌ జట్లకు టైటిల్స్‌ | rangareddy, hyderabad got tug of titles | Sakshi
Sakshi News home page

రంగారెడ్డి, హైదరాబాద్‌ జట్లకు టైటిల్స్‌

Published Mon, Feb 13 2017 10:14 AM | Last Updated on Tue, Sep 5 2017 3:37 AM

రంగారెడ్డి, హైదరాబాద్‌ జట్లకు టైటిల్స్‌

రంగారెడ్డి, హైదరాబాద్‌ జట్లకు టైటిల్స్‌

రాష్ట్ర స్థాయి టగ్‌ ఆఫ్‌ వార్‌ చాంపియన్‌షిప్‌  

సాక్షి, హైదరాబాద్‌: సీనియర్‌ (బీచ్‌) అంతర్‌ జిల్లా టగ్‌ ఆఫ్‌ వార్‌ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్, రంగారెడ్డి జట్లు సత్తా చాటాయి. కందుకూర్‌లోని న్యూ ఆదర్శ్‌ డిగ్రీ కళాశాలలో జరిగిన ఈ టోర్నీ పురుషుల విభాగంలో రంగారెడ్డి జట్టు విజేతగా నిలవగా... మహిళల విభాగంలో  హైదరాబాద్‌ జట్టు టైటిల్‌ను గెలుచుకుంది. ఆదివారం జరిగిన పురుషుల ఫైనల్లో రంగారెడ్డి జట్టు 3–0తో హైదరాబాద్‌పై విజయం సాధించింది.

 

అంతకుముందు జరిగిన సెమీస్‌ మ్యాచ్‌ల్లో రంగారెడ్డి 3–0తో నల్లగొండపై, హైదరాబాద్‌ 2–1తో నిజామాబాద్‌పై నెగ్గాయి. మహిళల ఫైనల్లో హైదరాబాద్‌ జట్టు 3–0తో రంగారెడ్డి జట్టును ఓడించి విజేతగా నిలిచింది. సెమీస్‌ మ్యాచ్‌ల్లో రంగారెడ్డి జట్టు 3–0తో ఆదిలాబాద్‌పై, హైదరాబాద్‌ జట్టు 3–0తో నిజామాబాద్‌పై గెలిచాయి. అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టగ్‌ ఆఫ్‌ వార్‌ సంఘం కార్యదర్శి పి. ఎమ్మాన్యుయేల్, రంగారెడ్డి జిల్లా టగ్‌ ఆఫ్‌ వార్‌ సంఘం అధ్యక్షుడు జి. యాదయ్య, కార్యదర్శి ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement