చాట్టోగ్రామ్: అఫ్గానిస్తాన్ క్రికెట్ సంచలనం రషీద్ ఖాన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టెస్టు ఫార్మాట్‌లో పిన్న వయసులో కెప్టెన్‌గా వ్యహరిస్తున్న ఘనతను రషీద్ లిఖించాడు. గురువారం బంగ్లాదేశ్‌తో ఆరంభమైన ఏకైక టెస్టు మ్యాచ్‌కు సారథిగా వ్యహరించనున్న నేపథ్యంలో రషీద్ ఈ ఫీట్‌ను సాధించాడు. ఈ క్రమంలోనే జింబాబ్వే మాజీ కెప్టెన్ తైబు పేరిట ఉన్న రికార్డును రషీద్ బ్రేక్ చేశాడు.
తైబు 20 ఏళ్ల 358 రోజుల వయసులో జింబాబ్వే తరుఫున సారథిగా ఎంపికయ్యాడు. అది ఇప్పటివరకూ పదిలంగా ఉండగా దాన్ని రషీద్ సవరించాడు. రషీద్ ఖాన్ 20 ఏళ్ల 350 రోజుల వయసులో అఫ్గాన్ టెస్టు జట్టుకు కెప్టెన్‌గా నియమించబడటంతో తైబు రికార్డును బద్ధలు కొట్టాడు. ఈ జాబితాలో రషీద్ ఖాన్, తైబుల తర్వాత భారత మాజీ కెప్టెన్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ ఉన్నారు. పటౌడీ 21 ఏళ్ల 77 రోజుల వయసులో భారత టెస్టు జట్టుకు కెప్టెన్‌గా సేవలందించారు.
Comments
Please login to add a commentAdd a comment