
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. గురువారం నగరంలోని రాజీవ్ గాంధీ స్టేడియంలో ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన రషీద్ ఖాన్ 13 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. అదే సమయంలో 18 డాట్ బాల్స్ వేశాడు. ఫలితంగా ఒక ఐపీఎల్ మ్యాచ్‌లో అత్యధిక డాట్స్ బాల్స్ వేసిన మూడో క్రికెటర్‌గా రషీద్ నిలిచాడు.
అంతకుముందు రవిచంద్రన్ అశ్విన్, అమిత్ మిశ్రాలు ఒక ఐపీఎల్ మ్యాచ్‌లో అత్యధికంగా 18 డాట్ బాల్స్ వేశారు. అయితే అశ్విన్ ఈ ఘనతను రెండుసార్లు సాధించాడు. ముంబైతో చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఒక్క వికెట్ తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు రషీద్ ఖాన్‌కే దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment