హైదరాబాద్: భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో చాలా ఆక్టీవ్‌గా ఉండే రవిశాస్త్రి టీమిండియా బ్లేజర్ ధరించి ఉన్న ఓ పాత ఫోటోను ఇన్‌స్టాలో షేర్ చేశాడు. ప్రతిభావంతులు ఎంతమంది ఉన్నా రాజీ పడకుండా కష్టపడేవారే విజయం సాధిస్తారనే అర్థంలో ఆ ఫోటోకు క్యాప్షన్‌ను జతచేశాడు. కాగా, బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ రవిశాస్త్రి పోస్ట్‌పై సందిస్తూ ‘క్యా బాత్ హై’ అంటూ కామెంట్ చేశాడు. (కొందరే ధైర్యంగా ఉంటారు: కోహ్లి)
బాలీవుడ్ హీరో కామెంట్ చేయడంతో రవిశాస్త్రి చేసిన పోస్ట్ మరింత వైరల్ అయింది. రణ్‌వీర్‌తో పాటు పలువురు సినీ, క్రీడా ప్రముఖులు రవిశాస్త్రి పోస్ట్‌ను లైక్ చేస్తున్నారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమయ్యారు రవిశాస్త్రి. అయితే ఈ ఖాళీ సమయాన్ని అలీబాగ్‌లోని తన ఫామ్‌హౌస్‌లో సరదాగా గడుపుతున్నాడు. అంతేకాకుండా అప్పడప్పుడు సోషల్ మీడియా వేదికగా పలు ఆసక్తికర, ఫన్నీ విషయాలను అభిమానులతో పంచుకుంటున్న విషయం తెలిసిందే. (భర్తను ముద్దుల్లో ముంచెత్తిన హీరోయిన్)
రవిశాస్త్రి పోస్ట్‌కు రణ్‌వీర్ రిప్లై
Published Wed, Jun 3 2020 2:20 PM | Last Updated on Wed, Jun 3 2020 2:30 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment