
న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యధిక వేతనం అందుకుంటున్న క్రికెట్ కోచ్‌గా రవిశాస్త్రి నిలిచాడు. ఏడాదికి బీసీసీఐ అతడికి దాదాపు ఏడున్నర కోట్ల రూపాయలు(1.17 మిలియన్ డాలర్లు) వేతనంగా చెల్లిస్తోందని ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫో వెల్లడించింది. లెహమాన్(0.55 డాలర్లు), బేలిస్(0.52 డాలర్లు) కంటే రెట్టింపు వేతనం రవిశాస్త్రి అందుకుంటున్నాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, టీమిండియా టాప్ క్రికెటర్ల వార్షిక వేతనం కంటే కూడా భారత్ కోచ్ పారితోషికంగా ఎక్కువగా ఉండటం విశేషం.
టీమిండియా కెప్టెన్, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి బీసీసీఐ నుంచి తీసుకునే వేతనం రవిశాస్త్రికి ఇచ్చే పారితోషికంతో పోలిస్తే తక్కువ ఉండటం అత్యంత ఆశ్చర్యం కలిగించే విషయం. కోహ్లికి ఏడాదికి బీసీసీఐ సుమారు ఆరున్నర కోట్ల రూపాయలు(మిలియన్ డాలర్లు) వేతనంగా అందిస్తోంది. వాణిజ్య ప్రకటనలు, ఇతర మార్గాల ద్వారా అతడు అత్యధికంగా ఆదాయం ఆర్జిస్తున్నాడు. అయితే కోహ్లి కంటే ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్(1.47 మిలియన్ డాలర్లు), ఇంగ్లండ్ కెప్టెన్ జోయ్ రూట్(1.27 మిలియన్ డాలర్లు) ఎక్కువ వేతనాలు అందుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment