రాజ్‌కోట్ : వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా శతకం పూర్తి చేసుకున్నాడు. 132 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో కెరీర్‌లో తొలి సెంచరీ నమోదు చేశాడు. దీంతో భారత్ 9 వికెట్ల నష్టానికి 649 పరుగులు చేసింది. అనంతరం భారత కెప్టెన్ డిక్లేర్ ఇచ్చి విండీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. అంతకు ముందు 364/4 ఓవర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. తొలి రోజు యువకెరటం పృథ్వీ షా శతకం సాధించగా.. పుజారా(86) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. రెండో రోజు ఆటలో కోహ్లి శతకం సాధించగా.. రిషబ్ పంత్(92) చేజార్చుకున్నాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన జడేజా తనదైన శైలిలో ఆచితూచి ఆడాడు. ఆరో వికెట్‌కు 64 పరుగులు జోడించిననంతరం కోహ్లి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. తర్వాత భారత్ త్వరగా వికెట్లు కోల్పోయింది. జడేజా టెయిలెండర్లు కుల్‌దీప్(12), ఉమేశ్ యాదవ్(22), మహ్మద్ షమీ(2 నాటౌట్)ల సాయంతో ఆచితూచి ఆడుతూ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment