
లండన్ : క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2019 ఇంగ్లండ్ వేదికగా అట్టహాసంగా ప్రారంభమైంది. వరల్డ్‌కప్‌లో భాగంగా ఇప్పటికే జరిగిన మ్యాచ్‌లు క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరించాయి. టోర్నీ ప్రారంభమైన వారం రోజుల తర్వాత టీమిండియాకు తొలి మ్యాచ్ ఉండటంతో ఆటగాళ్లు నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తూ దక్షిణాఫ్రికా కోసం వ్యూహాలు రచిస్తున్నారు. అయితే ఐసీసీ ఈ సారి వినూత్నంగా ప్రపంచకప్ ప్రమోషన్స్ కోసం సోషల్ మీడియాలో ఆక్టీవ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడూ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తోంది. అంతేకాకుండా ఆటగాళ్లకు వివిధ ‘పరీక్షలు’పెట్టి అభిమానులను అలరిస్తోంది.
ఈ నేపథ్యంలో టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కొన్ని సరదా ప్రశ్నలకి సమాధానమిచ్చిన వీడియోనే ఐసీసీ షేర్ చేసింది. నిర్వాహకులు అడిగిన కొన్ని సరదా ప్రశ్నలకు జడేజా సమాధానంగా పలువురి ఆటగాళ్ల పేర్లను వెల్లడించారు. ‘సెల్ఫీలను ఎవరు ఎక్కువ ఇష్టపడతారు- ధావన్, చెత్త డ్యాన్సర్ ఎవరు- ధోని, మైక్‌లో సందడి చేసేదేవరు-కోహ్లి, రొమాంటిక్ కామెడీస్ ఇష్టపడేదెవరు-బుమ్రా, తన గురించి తానే గూగుల్ చేసే వ్యక్తి- చహల్, కాఫీ ఎవరు ఎక్కువగా ఇష్టపడతారు- రోహిత్ శర్మ, ఆలస్యంగా వచ్చేవారు ఎవరు- రోహిత్, ఎప్పుడూ జిమ్‌లో ఉండేదెవరు- కోహ్లి, ఎప్పటికీ ఫోన్ పట్టుకుని ఉండేదెవరు-ధావన్’అంటూ రవీంద్ర జడేజా సమాధానమిచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ హల్‌చల్ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment