క్రిస్ గేల్ అవుట్
ఇండోర్:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 లో భాగంగా సోమవారం ఇక్కడ కింగ్స్ పంజాబ్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు నుంచి స్టార్ ఓపెనర్ క్రిస్ గేల్ ను తప్పించారు. గత రెండు మ్యాచ్ ల్లో గేల్ నిరాశపరచడంతో ఈ జమైకా స్టార్ ను రిజర్వ్ బెంచ్ కే పరిమితం చేశారు. అతని స్థానంలో దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్ తుది జట్టులోకి వచ్చాడు. ఐపీఎల్-10 సీజన్ లో ఏబీకి ఇదే తొలి మ్యాచ్. గాయం కారణంగా గడిచిన మ్యాచ్ ల్లో ఏబీ డివిలియర్స్ పాల్గొనలేదు.
అయితే డివిలియర్స్ అందుబాటులోకి వచ్చినా ఆర్సీబీ తాత్కాలిక కెప్టెన్ గా షేన్ వాట్సనే కొనసాగనున్నాడు. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటివరకూ రెండు మ్యాచ్ లు ఆడిన ఆర్సీబీ.. ఒకదాంట్లో ఓడగా, మరొక మ్యాచ్ లో గెలిచింది. మరొకవైపు ఆడిన తొలి మ్యాచ్ లో గెలిచి టోర్నీలో బోణి కొట్టిన కింగ్స్ పంజాబ్ రెండో మ్యాచ్ కు సిద్ధమైంది. ఇరు జట్లలో స్టార్ ఆటగాళ్లు ఉండటంతో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.
ఆర్సీబీ తుది జట్టు: షేన్ వాట్సన్(కెప్టెన్), విష్ణు వినోద్, ఏబీ డివిలియర్స్, కేదర్ జాదవ్, మన్ దీప్ సింగ్, స్టువర్ట్ బిన్నీ, పవన్ నేగీ, ఇక్బాల్ అబ్దుల్లా, తైవాల్ మిల్స్, స్టాన్ లేక్, చాహల్
కింగ్స్ తుది జట్టు: గ్లెన్ మ్యాక్స్ వెల్(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, హషీమ్ ఆమ్లా, వోహ్రా, సాహా, స్టోనిస్,అక్షర్ పటేల్, మోహిత్ శర్మ, సందీప్ శర్మ, వరుణ్ అరోన్, నటరాజన్