
న‍్యూఢిల్లీ: ఆసియాకప్‌లో భాగంగా టీమిండియా తన తొలి మ్యాచ్‌ను పసికూన హాంకాంగ్‌తో తలపడనుంది. ఈ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతున్న టీమిండియా.. హాంకాంగ్‌పై భారీ విజయాన్ని సాధించి ఘనమైన ఆరంభాన్నిచ్చేందుకు ఉవ్విళ్లూరుతోంది. కాగా, ఆసియాకప్ నుంచి టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి దూరమైన సంగతి తెలిసిందే. వరుస సిరీస్‌లతో అలసిపోయిన కోహ్లి.. ప్రస్తుతం విశ‍్రాంతి తీసుకుంటున్నాడు. దీనిలో భాగంగా భారత క్రికెట్ జట్టుకు కోహ్లి విషెస్ తెలియజేశాడు.
‘ఆసియాకప్ వంటి ఒక సూపర్ సిరీస్‌లో తలపడుతున్న భారత జట్టుకు అభినందనలు’ అంటూ కోహ్లి ట్వీట్ చేశాడు. ఈ టోర్నీలో కోహ్లి గైర్హాజరీతో రోహిత్ శర్మకు కెప్టెన్సీ బాధ్యతలు అప‍్పజెప్పారు. ఆసియాకప్‌లో భారత్ జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా చేయడం ఇదే తొలిసారి.
Comments
Please login to add a commentAdd a comment