న్యూఢిల్లీ: భారత వెయిట్‌లిఫ్టర్లు పతకాల పంట పండించారు. మలేసియాలో జరుగుతున్న కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో రెండో రోజు భారత లిఫ్టర్లు ఏకంగా 36 పతకాలు గెల్చుకున్నారు. యూత్, జూనియర్, సీనియర్ విభాగాలలో ఈ పతకాలు వచ్చాయి. ఇందులో 19 స్వర్ణాలు, 11 రజతాలు, ఆరు కాంస్య పతకాలు ఉన్నాయి. సీనియర్ పురుషుల విభాగంలో సుఖెన్ డే (56 కేజీలు).... సీనియర్ మహిళల విభాగంలో మీరాబాయి చాను (48 కేజీలు) మూడేసి స్వర్ణాలు సొంతం చేసుకున్నారు.
యూత్ బాలుర విభాగంలో టీబీసీ లాల్‌చన్‌హిమా (56 కేజీలు), లాలూ టాకూ (62 కేజీలు) మూడేసి పసిడి పతకాలు నెగ్గారు. యూత్ బాలికల విభాగలో చంద్రిక తరఫ్‌దార్ (44 కేజీలు), మోనాలిసా సోమోవాల్ (48 కేజీలు) కూడా మూడేసి బంగారు పతకాలు సాధించారు. భారత్ నుంచి సీనియర్, జూనియర్ విభాగాలలో 15 మంది చొప్పున, యూత్ విభాగంలో 11 మంది ఈ పోటీల్లో పాల్గొంటున్నారు.
ఒకే రోజు భారత్‌కు 36 పతకాలు
Published Wed, Nov 27 2013 1:48 AM | Last Updated on Sat, Sep 2 2017 1:00 AM
Advertisement