సిడ్నీ:వచ్చే నెలలో న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లతో జరుగనున్న ముక్కోణపు టీ 20 సిరీస్‌లో భాగాంగా ఆస్ట్రేలియా అసిస్టెంట్ కోచ్‌గా మాజీ సారథి రికీ పాంటింగ్ ఎంపికయ్యాడు. ఫలితంగా ఇప్రధాన కోచ్ డారెన్ లీమన్ కోచింగ్ స్టాప్ బృందంలో పాంటింగ్ చేరిపోయాడు. ఈ మేరకు గత కొంతకాలంగా క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ)తో చర్చలు జరిపిన పాంటింగ్ అందుకు తాజాగా అంగీకారం తెలిపాడు.
తన అసిస్టెంట్ కోచ్ బాధ్యతపై స్పందించిన పాంటింగ్.. ' ఇంగ్లండ్-న్యూజిలాండ్‌తో సిరీస్ కోసం మరోసారి ఆసీస్ జట్టుతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. గత ఏడాది జట్టుతో కలిసి పనిచేసిన అనుభవాన్ని ఎప్పటికీ మరిచిపోలేను. టీ20 ఫార్మాట్‌లో సత్తా చాటేందుకు మా వద్ద చాలామంది ఆటగాళ్లు ఉన్నారు' అని పాంటింగ్ తెలిపాడు. గత రెండు ఐపీఎల్ సీజన్‌లలో ముంబై ఇండియన్స్ కోచ్‌గా పనిచేసిన పాంటింగ్.. ఈ ఏడాది ఢిల్లీ డేర్ డెవిల్స్ కోచ్‌గా సేవలందించనున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment