రియో ఒలింపిక్స్ నాణేలు విడుదల | Rio Olympic coins unveiled by Central Bank | Sakshi
Sakshi News home page

రియో ఒలింపిక్స్ నాణేలు విడుదల

Published Sun, Nov 30 2014 12:54 AM | Last Updated on Sat, Sep 2 2017 5:21 PM

రియో ఒలింపిక్స్ నాణేలు విడుదల

రియో ఒలింపిక్స్ నాణేలు విడుదల

రియో డి జనీరో: రియో ఒలింపిక్స్ (2016) నాణేల (కాయిన్స్)ను బ్రెజిల్ సెంట్రల్ బ్యాంక్ విడుదల చేసింది. మొదటి విడతలో భాగంగా ఒక స్వర్ణం, నాలుగు రజతాలు, మరో నాలుగు సాధారణ నాణేలను అందుబాటులోకి తెచ్చామని గేమ్స్ నిర్వాహకులు తెలిపారు. ‘1952 హెల్సింకీ గేమ్స్ నుంచి నాణేలను విడుదల చేయడం గేమ్స్‌లో భాగంగా కొనసాగుతోంది.

అదే మాదిరిగా రియో కాయిన్స్‌ను కూడా ఆవిష్కరించారు. మొత్తం 36 కాయిన్స్ అందుబాటులోకి వచ్చాయి’ అని రియో గేమ్స్ అధ్యక్షుడు కార్లోస్ నుజ్మాన్ అన్నారు. బంగారు నాణెంలో ఓ వైపు క్రీస్తు విగ్రహం, రెండో వైపు 100 మీటర్ల స్ప్రింట్‌ను చిత్రీకరించారు. రజత నాణేలలో ఓ వైపు రియోకు చెందిన ప్రఖ్యాత గుర్తులు, మరోవైపు అథ్లెట్లు పోటీపడుతున్న దృశ్యాలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement