నాటింగ్‌హామ్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు ద్వారా ఈ ఫార్మాట్‌లో అరంగేట్రం చేసిన భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ పలు అరుదైన రికార్డులు సాధించాడు. అరంగేట్రం టెస్టులోనే ఐదు క్యాచ్‌లు పట్టిన నాల్గో భారత వికెట్ కీపర్‌గా రిషబ్ ఘనత నమోదు చేశాడు. ఇంగ్లండ్ సీనియర్ ఓపెనర్ అలిస్టర్ కుక్ (29) క్యాచ్‌ని అందుకుని వికెట్ కీపర్‌గా ఘనమైన బోణి అందుకున్న రిషబ్ పంత్.. ఆ తర్వాత వరుసగా జెన్నింగ్స్ (20), పోప్ (10), క్రిస్‌వోక్స్ (8), ఆదిల్ రషీద్ (5) క్యాచ్‌లను అందుకున్నాడు. ఫలితంగా అరంగేట్రంలో ఈ ఘనత సాధించిన నాల్గో భారత వికెట్ కీపర్‌గా గుర్తింపు సాధించాడు.
అంతకుముందు టెస్టు అరంగేట్రంలో ఐదు క్యాచ్‌లు పట్టిన భారత కీపర‍్లలో తమ్‌హానే, కిరణ్ మోరే, నమాన్ ఓజాలు ఉన్నారు. మరొకవైపు ఒక ఇన్నింగ్స్‌లో ఐదు క్యాచ్‌లు పట్టిన తొలి భారత వికెట్ కీపర్‌గా రిషబ్ నిలిచాడు. ఇక ఒక ఇన్నింగ్స్‌లో ఐదు క్యాచ్‌లు పట్టిన తొలి ఆసియన్ వికెట్ కీపర్‌గా, ఓవరాల్‌గా మూడో వికెట్ కీపర్‌గా రిషబ్ రికార్డులు సాధించాడు.
చదవండి: మ్యాచ్ మన చేతుల్లోకి
Comments
Please login to add a commentAdd a comment