చెన్నై: వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి వన్డే ద్వారా టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఫామ్‌లోకి వచ్చాడు. 69 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 71 పరుగులు చేసి ఐదో వికెట్‌గా ఔటయ్యాడు. ఓ చక్కటి ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్న పంత్.. ఫుల్ స్వింగ్‌లో ఉన్న సమయంలో తనకు అచ్చిరాని షాట్‌ను కొట్టి వికెట్‌ను సమర్పించుకున్నాడు. ఎక్కువగా డీప్ బ్యాక్‌వర్డ్ స్వేర్ లెగ్, డీప్ పాయింట్‌ల్లో ఔటయ్యే పంత్ మళ్లీ అదే తప్పిదం చేశాడు. బ్యాక్‌వర్డ్ స్వేర్ లెగ్‌లోకి భారీ షాట్ ఆడి వికెట్ కోల్పోయాడు. పొలార్డ్ వేసిన 40 ఓవర్ మూడో బంతిని కవర్స్ మీదుగా ఫోర్‌కు పంపిన పంత్.. ఆ ఓవర్ మరుసటి బంతిని స్వేర్ లెగ్ మీదుగా భారీ షాట్‌కు యత్నించాడు.(ఇక్కడ చదవండి: అయ్యర్ మళ్లీ కొట్టేస్తే.. పంత్ ఎన్నాళ్లకెన్నాళ్లకు)
అయితే ఆ బంతి పూర్తిగా మిడిల్ కాకపోవడంతో పైకి లేచింది. దాంతో అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న హెట్‌మెయిర్ క్యాచ్ పట్టుకోవడంతో పంత్ సెంచరీ చేసుకునే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. పంత్ వన్డేల్లో ఎప్పుడో అరంగేట్రం చేసినా ఈ మ్యాచ్ ముందు వరకూ హాఫ్ సెంచరీ నమోదు చేయలేదు. ఈ మ్యాచ్ ద్వారా హాఫ్ సెంచరీ లోటును పూడ్చుకున్న పంత్.. దాన్ని సెంచరీగా మలచుకోవడంలో విఫలమయ్యాడు. భారత స్కోరు 210 పరుగుల వద్ద ఉండగా పంత్ ఐదో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. అంతకుముందు శ్రేయస్ అయ్యర్(70) సింపుల్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అల్జారీ జోసెఫ్ బౌలింగ్‌లో మిడ్ వికెట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న పొలార్డ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ వర్మ(36) ఫర్వాలేదనిపించగా, కేఎల్ రాహుల్(6), విరాట్ కోహ్లి(4)లు విఫలమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment