సౌతాంప్టాన్: ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టు ద్వారా ఈ ఫార్మాట్‌లో అరంగేట్రం చేసిన భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ అరుదైన రికార్డులు సాధించిన సంగతి తెలిసిందే. అరంగేట్రం టెస్టులోనే ఐదు క్యాచ్‌లు పట్టిన నాల్గో భారత వికెట్ కీపర్‌గా రిషబ్ ఘనత నమోదు చేశాడు. మరొకవైపు ఒక ఇన్నింగ్స్‌లో ఐదు క్యాచ్‌లు పట్టిన తొలి భారత వికెట్ కీపర్‌గా రిషబ్ నిలిచాడు. ఇక ఒక ఇన్నింగ్స్‌లో ఐదు క్యాచ్‌లు పట్టిన తొలి ఆసియన్ వికెట్ కీపర్‌గా, ఓవరాల్‌గా మూడో వికెట్ కీపర్‌గా రిషబ్ రికార్డులు సాధించాడు.
అయితే ఇంగ్లండ్‌తో నాల్గో టెస్టు రిషబ్ పంత్ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఖాతా తెరవకుండానే రిషబ్ పంత్ పెవిలియన్ చేరాడు. కాగా, 29 బంతులు ఆడిన రిషబ్ డకౌట్‌గా ఔటయ్యాడు. దీంతో పంత్ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 29 బంతులాడి ఒక్క పరుగు కూడా చేయని భారత బ్యాట్స్‌మెన్ జాబితాలో పంత్ నిలిచాడు. ఈ జాబితాలో ఇప్పటివరకూ ఇర్ఫాన్ పఠాన్‌తో కలిసి సురేశ్ రైనా సంయుక్తంగా అగ‍్రస్థానంలో కొనసాగుతుండగా, ఇప్పుడు ఆ జాబితాలో రిషబ్ చేరిపోయాడు. ఆ తర్వాత స్థానాల్లో మునాఫ్ పటేల్(28 బంతులు), సంజయ్ మంజ్రేకర్(25 బంతులు), వీవీఎస్ లక్ష్మణ్(24 బంతులు)లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment