ఆక్లాండ్: భారత క్రికెట్ జట్టులోకి వచ్చిన తక్కువ కాలంలోనే రెగ్యురల్ కీపర్‌గా మారిపోయి వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ వచ్చాడు రిషభ్ పంత్. తన అరంగేట్రం ఆరంభంలో మెరుపులు మెరిపించినా ఆ తర్వాత రిషభ్‌లో వేడి తగ్గింది. అటు బ్యాటింగ్‌లోనూ ఇటు కీపింగ్‌లోనూ నిరాశపరుస్తూ టీమిండియా మేనేజ్‌మెంట్ నమ్మకాన్ని కోల్పోతూ వచ్చాడు. మొన్నటివరకూ పంత్ ఒక టాలెంటెడ్ క్రికెటర్ అని అతనికి వరుసగా అవకాశాలు ఇస్తే తప్పేముందని చెప్పిన జట్టులోని కొందరు పెద్దలు.. ఇప్పుడు అతని ఉంటే ఎంతా.. లేకపోతే ఎంతా అనే పరిస్థితికి వచ్చేశారు. ప్రస్తుత జట్టులో పంత్ లేకున్నా ఏమీ కాదనే సంకేతాలు ఇస్తున్నారు. ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో గాయం కారణంగా పంత్ దూరం కాగా, ఆ స్థానంలో కేఎల్ రాహుల్‌కు కీపింగ్ బాధ్యతలు ఇచ్చారు.
పంత్‌కు ఏ క్షణంలో గాయమైందో కానీ అది అతని కెరీర్‌నే డైలమాలో పడేసింది. రాహుల్ కీపర్‌గా, బ్యాట్స్‌మన్‌గా రాణించడంతో ఎదురులేకుండా పోయింది. తాజాగా పంత్ నేచురల్ కీపర్ ఏమీ కాదంటూ హెడ్ కోచ్ రవిశాస్త్రి చెప్పడమే ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ‘పంత్ సహజసిద్ధమైన కీపర్ కాదు. అతను కీపర్‌గా మెరుగవ్వాలంటే ఇంకా చాలా శ్రమించాలి. ఒకవేళ పంత్ శ్రమించకపోతే అతని టాలెంట్ వేస్ట్ అవుతుంది. బ్యాట్స్‌మన్‌గా కూడా పంత్ ఎంతో పరిణితి సాధించాలి. అతనొక బిగ్ హిట్టర్. విధ్వంసకర ఆటగాడు. దానికి సానబెట్టుకోవాలి.. పరిస్థితులకు తగ్గట్టు ఆడటం నేర్చుకోవాలి. రిషభ్ పంత్ క్రీజ్‌లోకి వచ్చిన ప్రతీసారి అతని నుంచి అభిమానులు సిక్స్‌లు కోరుకుంటున్నారు. ఆ పరిస్థితుల్లో గేమ్ ప్లాన్‌పై పంత్‌కు అవగాహన అవసరం. పంత్ వికెట్ కీపింగ్ కూడా బాగా ప్రాక్టీస్ చేయాలి. అతను ఏమీ నేచురల్ వికెట్ కీపర్ కాదు. కానీ కీపర్‌గా మంచి టాలెంట్ ఉంది. పంత్ ఆటను కీపింగ్‌ను మెరుగు పరుచుకోలేకపోతే అతని టాలెంట్ వృథా అవుతుంది’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.
ఇటీవల కాలంలో కీపింగ్, బ్యాటింగ్‌పై బాగా దృష్టి సారించాడని హెడ్ కోచ్ స్థానంలో ఉన్న రవిశాస్త్రి చెబుతున్నా.. పంత్ ఆట మొహం మొత్తేసినట్లే కనబడుతోంది. టీ20 వరల్డ్‌కప్ ప్రణాళికల్లో పంత్ ఉన్నాడా.. లేడా అనేది తెలియాలంటే న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లోనే దాదాపు తేలిపోవచ్చు. ఈ సిరీస్‌లో కనీసం పంత్‌కు రెండు టీ20లు ఆడే అవకాశం కూడా ఇవ్వకపోతే మాత్రం అతనికి కష్టకాలం మొదలైనట్లే. (ఇక్కడ చదవండి: ‘పంత్‌ను అలా చూడాలనుకుంటున్నా’)
Comments
Please login to add a commentAdd a comment