తిరువనంతపురం: ఇంగ్లండ్ లయన్స్‌పై భారత ‘ఎ’ జట్టు ఆధిపత్యం కొనసాగుతోంది. సిరీస్‌లో వరుసగా నాలుగో వన్డేలోనూ భారత కుర్రాళ్లు ప్రత్యర్థిని చిత్తు చేశారు. మంగళవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ లయన్స్‌పై ఘన విజయం సాధించింది. ముందుగా లయన్స్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. ఒలి పోప్ (103 బంతుల్లో 65; 6 ఫోర్లు), స్టీవ్ ములాని (54 బంతుల్లో 58 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీలు సాధించారు.
శార్దుల్ ఠాకూర్ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం భారత్ 46.3 ఓవర్లలో 4 వికెట్లకు 222 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రిషభ్ పంత్ (76 బంతుల్లో 73 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) దూకుడుగా ఆడి హాఫ్ సెంచరీ చేయగా... దీపక్ హుడా (47 బంతుల్లో 47 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (77 బంతుల్లో 42; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. సిరీస్‌లో భారత్ ఇప్పటికే 4–0తో ఆధిక్యంలో నిలవగా చివరి మ్యాచ్ గురువారం జరుగుతుంది.
చెలరేగిన రిషభ్ పంత్
Published Wed, Jan 30 2019 1:37 AM | Last Updated on Wed, Jan 30 2019 1:37 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment