Sardul Thakur
-
చెలరేగిన రిషభ్ పంత్
తిరువనంతపురం: ఇంగ్లండ్ లయన్స్‌పై భారత ‘ఎ’ జట్టు ఆధిపత్యం కొనసాగుతోంది. సిరీస్‌లో వరుసగా నాలుగో వన్డేలోనూ భారత కుర్రాళ్లు ప్రత్యర్థిని చిత్తు చేశారు. మంగళవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ లయన్స్‌పై ఘన విజయం సాధించింది. ముందుగా లయన్స్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. ఒలి పోప్ (103 బంతుల్లో 65; 6 ఫోర్లు), స్టీవ్ ములాని (54 బంతుల్లో 58 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. శార్దుల్ ఠాకూర్ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం భారత్ 46.3 ఓవర్లలో 4 వికెట్లకు 222 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రిషభ్ పంత్ (76 బంతుల్లో 73 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) దూకుడుగా ఆడి హాఫ్ సెంచరీ చేయగా... దీపక్ హుడా (47 బంతుల్లో 47 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (77 బంతుల్లో 42; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. సిరీస్‌లో భారత్ ఇప్పటికే 4–0తో ఆధిక్యంలో నిలవగా చివరి మ్యాచ్ గురువారం జరుగుతుంది. -
సచిన్ ‘10’కు టాటా...
న్యూఢిల్లీ: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ధరించిన పదో నంబర్ జెర్సీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అనధికారికంగా టాటా చెప్పింది. దీంతో ఇక ఆ నంబర్ చరిత్రగానే మిగలనుంది. మైదానంలో ఏ భారత ఆటగాడు కూడా 10 జెర్సీతో బరిలోకి దిగడు. 2013లో సచిన్ రిటైరయ్యాక ఒక్కసారి మినహా ఈ నాలుగేళ్లలో ఎవరూ ఆ జెర్సీ జోలికి వెళ్లలేదు. ఈ ఏడాది శార్దుల్ ఠాకూర్ అరంగేట్రం చేసిన మ్యాచ్‌లో పదో నంబర్‌తో కనిపించడంతో సోషల్ మీడియాలో అభిమా నులు విమర్శలు గుప్పించారు. దీంతో ఇప్పటివరకు మళ్లీ ఆ నంబర్ కనిపించలేదు. నిజానికి ఐసీసీ నిబంధనల ప్రకారం ఏ నంబర్‌కూ అధికారికంగా టాటా చెప్పే అవకాశం లేదు. అదే వేసుకోవాలనే ఒత్తిడి కూడా లేదు. అయితే ఓ సారి వివాదం రేగడంతో ఆటగాళ్లెవరూ ఆ నంబర్ జెర్సీపై ఆసక్తి చూపడం లేదని బోర్డు వర్గాలు తెలిపాయి. ఐపీఎల్లో మాత్రం ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ జట్టు టెండూల్కర్ గౌరవార్థం ‘10’కు అధికారికంగానే టాటా చెప్పేసింది. అంటే భవిష్యత్తులో సదరు ఫ్రాంచైజీ ఆటగాళ్లెవరూ ‘10’తో కనిపించరు. ఒక జట్టు జెర్సీ నంబర్‌కు రిటైర్మెంట్ పలకడం కొత్తేమీ కాదు. ఫుట్‌బాల్‌లో వివిధ లీగ్‌లలో ఇలా జరగ్గా... బాస్కెట్‌బాల్ దిగ్గజం మైకేల్ జోర్డాన్ రిటైరయ్యాక షికాగో బుల్స్ 23 నంబర్ జెర్సీకి మంగళం పలికింది. అయితే అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో ‘ఫిఫా’ మాత్రం ఇలాంటి వాటిని అనుమతించదు. 2002 వరల్డ్‌కప్ కోసం అర్జెంటీనా మారడోనాకు గౌరవంగా 10 నంబర్ జెర్సీ లేకుండా 23 మంది సభ్యుల టీమ్‌ను ప్రకటించింది. దీనికి ఫిఫా ఒప్పుకోకపోవడంతో 24వ ఆటగాడిగా అప్పటి వరకు లెక్కలో ఉన్న ఏరియల్ ఒర్టెగా 10 నంబర్‌తోనే బరిలోకి దిగాల్సి వచ్చింది. ఇప్పుడు 10 నంబర్‌ను మరో దిగ్గజం మెస్సీ వాడుతున్నాడు. -
శార్దూల్ ఠాకూర్‌కు చోటు
► వైస్‌కెప్టెన్‌గా రహానే ► షమీ పునరాగమనం ► వెస్టిండీస్‌తో టెస్టులకు భారత జట్టు ముంబై: వెస్టిండీస్‌తో జరిగే నాలుగు టెస్టుల సిరీస్ కోసం సెలక్టర్లు సోమవారం భారత జట్టును ప్రకటించారు. రెండు మార్పులు మినహా సొంతగడ్డపై దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన జట్టుపైనే కమిటీ నమ్మకముంచింది. ఆ సిరీస్‌లో ఆకట్టుకోలేకపోయిన పేసర్ వరుణ్ ఆరోన్ స్థానంలో కొత్త ఆటగాడు శార్దూల్ ఠాకూర్ ఎంపికయ్యాడు. వన్డే వరల్డ్ కప్ తర్వాత గాయం కారణంగా అంతర్జాతీయ మ్యాచ్ ఆడని మరో పేసర్ మొహమ్మద్ షమీ కూడా తిరిగి జట్టులోకి వచ్చాడు. టీమ్‌తో పాటు ఉన్నా, మ్యాచ్ ఆడని గుర్కీరత్ సింగ్‌ను తప్పించారు. 17 మంది సభ్యుల జట్టుకు విరాట్ కోహ్లి కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఈ ఫార్మాట్లో కీలక ఆటగాడిగా ఎదిగిన అజింక్య రహానేకు తొలి సారి టెస్టు జట్టు వైస్ కెప్టెన్సీ అవకాశం దక్కడం విశేషం. ముంబైకి చెందిన 24 ఏళ్ల శార్దూల్ ఒక్కడే ఈ టీమ్‌లో పూర్తిగా కొత్త ఆటగాడు. నాలుగేళ్ల క్రితం రంజీ ట్రోఫీలోకి అడుగు పెట్టిన అతను 37 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 27.53 సగటుతో 133 వికెట్లు పడగొట్టాడు. 2014-15 సీజన్లో 48 వికెట్లతో సంయుక్తంగా రంజీ టాపర్‌గా నిలిచిన శార్దుల్... 2015-16 సీజన్లో 41 వికెట్లు తీసి ముంబై చాంపియన్‌గా నిలవడంతో కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనే అతనికి టెస్టు జట్టులో చోటు కల్పించింది. ఇంకా తుది తేదీలు ఖరారు కాని ఈ పర్యటనలో భారత్, విండీస్‌తో నాలుగు టెస్టులు ఆడుతుంది. ఐపీఎల్లో పట్టించుకోకపోయినా...: రెండు వారాల క్రితం పనికి రాడంటూ ఐపీఎల్ జట్టు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అతడిని ఇంటికి పంపించింది. ఇప్పుడు శార్దూల్ ఠాకూర్ నేరుగా టీమిండియాకే ఎంపికయ్యాడు. 2014నుంచి మూడు సీజన్లలో కలిపి ఐపీఎల్లో అతడిని పంజాబ్ కేవలం ఒకే మ్యాచ్‌లో ఆడించింది. తనను తప్పించిన తర్వాత అసహనంతో ‘ఐపీఎల్ నిజంగానే అద్భుతాలు చేసింది’ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించిన శార్దూల్‌కు ఇప్పుడు సరైన అవకాశం లభించింది. ముంబై కీలక బౌలర్‌గా అతని ప్రదర్శనను సెలక్టర్లు గుర్తించారు