ముంబై రాకెట్స్‌ జోరు | Rockets rally in Mumbai | Sakshi
Sakshi News home page

ముంబై రాకెట్స్‌ జోరు

Published Fri, Jan 6 2017 11:57 PM | Last Updated on Tue, Sep 5 2017 12:35 AM

ముంబై రాకెట్స్‌ జోరు

ముంబై రాకెట్స్‌ జోరు

లక్నో: ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌–2) రెండో సీజన్‌లో ముంబై రాకెట్స్‌ జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. అవధ్‌ వారియర్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై రాకెట్స్‌ 3–2 పాయింట్ల తేడాతో గెలిచింది. తొలి మ్యాచ్‌గా జరిగిన పురుషుల డబుల్స్‌లో లీ యోంగ్‌ డే–నిపిత్‌పోన్‌ జోడీ 11–7, 3–11, 13–11తో గో వి షెమ్‌–మార్కిస్‌ కిడో (వారియర్స్‌) జంటపై నెగ్గడంతో ముంబై 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో మ్యాచ్‌గా జరిగిన పురుషుల సింగిల్స్‌లో అజయ్‌ జయరామ్‌ 5–11, 15–14, 11–5తో కిడాంబి శ్రీకాంత్‌ (వారియర్స్‌)పై సంచలన విజయం సాధించడంతో ముంబై 2–0తో ముందంజ వేసింది. మూడో మ్యాచ్‌గా జరిగిన మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్‌ 12–10, 4–11, 11–5తో సుంగ్‌ జీ హున్‌ (ముంబై)ను ఓడిం చడంతో వారియర్స్‌ ఖాతాలో తొలి పాయింట్‌ చేరింది.

నాలుగో మ్యాచ్‌ గా జరిగిన పురుషుల సింగిల్స్‌ ముంబై ‘ట్రంప్‌’ మ్యాచ్‌లో హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ 14–12, 9–11, 11–8తో విన్సెంట్‌ వోంగ్‌ వింగ్‌ కీ (వారియర్స్‌) గెలిచాడు. దాంతో ముంబై రాకెట్స్‌ 4–1తో విజయాన్ని ఖాయం చేసుకుంది. ఐదో మ్యాచ్‌గా జరిగిన మిక్స్‌డ్‌ డబుల్స్‌ వారియర్స్‌ ‘ట్రంప్‌’ మ్యాచ్‌లో సావిత్రి–బొదిన్‌ ఇసారా ద్వయం 11–8, 11–4తో నిపిత్‌పోన్‌–జీబా జంటపై గెలిచినా తుదకు అవధ్‌ వారియర్స్‌ 3–4తో ఓటమిని మూటగట్టుకుంది. శనివారం జరిగే బెంగళూరు బ్లాస్టర్స్‌తో హైదరాబాద్‌ హంటర్స్‌ తలపడుతుంది.  

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement