స్టీవ్ స్మిత్...నీ మిత్రులకే చోటా? | Rodney Hogg accuses Australia captain smith | Sakshi
Sakshi News home page

స్టీవ్ స్మిత్...నీ మిత్రులకే చోటా?

Published Thu, Sep 28 2017 12:56 PM | Last Updated on Thu, Sep 28 2017 12:56 PM

Rodney Hogg accuses Australia captain smith

సిడ్నీ:టీమిండియాతో వన్డే సిరీస్ ను కోల్పోయిన ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుపై విమర్శల వర్షం కురుస్తోంది. ప్రధానంగా ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ లక్ష్యంగా మాజీ ఫాస్ట్ బౌలర్ రాడ్నీ హాగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఆసీస్ జట్టులో 'చెత'ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇవ్వడానికి స్మిత్ కారణమంటూ ధ్వజమెత్తాడు. అందుకు కారణం వారు స్మిత్ మిత్రులు కావడమేనంటూ విమర్శలు గుప్పించాడు. స్టీవ్ స్మిత్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడు. అతను సెలక్టర్ కాదనే విషయం ముందు తెలుసుకోవాలి. ఆసీస్ జట్టులో ఆస్టన్ ఆగర్, కార్ట్ రైట్, నిక్ మాడిన్ సన్ లు చోటు కల్పించడానికి స్టీవ్ స్మిత్ కారణం. అసలు వారు ఎంపిక ఎలా జరిగింది. స్మిత్ కు మిత్రులు కావడం వల్లే. సెలక్షన్ అనేది నిజాయితీగా ఉండాలి. ప్రస్తుత ఆసీస్ జట్టులో అది లేదు.  స్మిత్ తో సాన్నిహిత్యంగా ఉన్నవారిని జట్టులోకి తీసుకుంటారా?'అని హాగ్ ప్రశ్నించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement