బోపన్న జోడికి టైటిల్ | Rohan Bopanna and Edouard Roger-Vasselin win Tokyo title | Sakshi
Sakshi News home page

బోపన్న జోడికి టైటిల్

Published Mon, Oct 7 2013 1:17 AM | Last Updated on Fri, Sep 1 2017 11:24 PM

బోపన్న జోడికి టైటిల్

బోపన్న జోడికి టైటిల్

టోక్యో: ఈ సీజన్‌లో భారత టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న రెండో టైటిల్ సాధించాడు. జపాన్ ఓపెన్‌లో బోపన్న-రోజర్ వాసెలిన్ (జపాన్) జోడి డబుల్స్ టైటిల్ గెలుపొందింది. ఆదివారం జరిగిన ఫైనల్లో బోపన్న-వాసెలిన్ జంట 7-6 (7/5), 6-4తో వరుస సెట్లలో జేమీ ముర్రే (బ్రిటన్)-జాన్ పీర్స్ (ఆస్ట్రేలియా) ద్వయంపై చెమటోడ్చి నెగ్గింది. గంటా 17 నిమిషాల పాటు జరిగిన ఈ పోరు హోరాహోరీగా సాగింది.
 
 తొలి సెట్‌లో బోపన్న ద్వయంకు ఐదు బ్రేక్ పాయింట్ అవకాశాలు లభించినప్పటికీ ముర్రే-పీర్స్ జంట సమన్వయంతో నీరుగార్చింది. దీంతో ఈ సెట్ టైబ్రేక్‌కు దారితీసింది. రెండో సెట్‌లో భారత్-ఫ్రాన్స్ జంట ఓ బ్రేక్ పాయింట్ సాధించి టైటిల్ చేజిక్కించు కుంది. బోపన్న జోడికి 92,200 డాలర్ల (రూ. 56 లక్షల 60 వేలు) ప్రైజ్‌మనీ లభించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement