
రోహిత్ దూకుడు
మెల్బోర్న్:ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో ట్వంటీ 20లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ దూకుడును కొనసాగిస్తున్నాడు. రోహిత్ 37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు సాయంతో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అంతకుముందు మరో ఓపెనర్ శిఖర్ ధావన్(42;32 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగంగా ఆడే క్రమంలో తొలి వికెట్ గా పెవిలియన్ కు చేరాడు. దీంతో టీమిండియా 12 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 104 పరుగులు చేసింది. రోహిత్(53) కు జతగా విరాట్ కోహ్లి క్రీజ్ లో ఉన్నాడు.
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత టీమిండియాను బ్యాటింగ్ ఆహ్వానించింది. తొలి ట్వంటీ 20లో గెలిచిన టీమిండియా ఈ మ్యాచ్ లో కూడా విజయం సాధించి సిరీస్ ను సాధించాలని భావిస్తోంది.