విశాఖ: చాలాకాలం తర్వాత టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మకి కెప్టెన్ విరాట్ కోహ్లి అండగా నిలిచాడు. టెస్టుల్లో రోహిత్ ఓపెనర్‌గా సెట్ అవుతాడా.. లేదా అనే దానిపై చర్చ నడిచే నేపథ్యంలో ఈ విషయంలో తమకు ఏమీ తొందరేమీ లేదంటూ కోహ్లి భరోసా ఇచ్చాడు. ఇటీవల దక్షిణాఫ్రికా జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్ కావడంతో అతను ఓపెనర్‌గా సరైన వ్యక్తి కాదనే వాదన మరోసారి తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో తొలి టెస్టుకు ముందు కోహ్లి మాట్లాడుతూ.. ‘ రోహిత్ విషయంలో మాకేమీ తొందరలేదు. అతను టెస్టు ఓపెనర్‌గా సక్సెస్ అవుతాడా.. లేదా అప్పుడే తెలియదు. కచ్చితంగా రోహిత్ టెస్టు ఓపెనర్‌గా కూడా రాణిస్తాడు. సరైన సమయంలో రోహిత్ గాడిలో పడతాడు. ఈ విషయంలో రోహిత్‌కు మనం సమయం ఇవ్వాలి’ అని కోహ్లి పేర్కొన్నాడు.
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు రోహిత్ శర్మను ఎంపిక చేసిన తెలిసిందే. రోహిత్‌ను ఓపెనర్‌గా దింపే క‍్రమంలోనే రోహిత్‌ను టీమిండియా మేనేజ్‌మెంట్ ఎంపిక చేసింది. అదే సమయంలో మరో ఓపెనర్ కేఎల్ రాహుల్‌కు ఉద్వాసన పలికారు. విండీస్ పర్యటనలో రాహుల్ ఓపెనర్‌గా విఫలం కావడంతో అతన్ని తప్పించారు. అదే సమయంలో ఆ భారం రోహిత్‌పై వేశారు. కాగా, ప్రాక్టీస్ మ్యాచ్‌లో రెండు బంతులు మాత్రమే ఆడిన రోహిత్ పరుగులేమీ చేయకుండా నిష్క్రమించాడు. దాంతోనే రోహిత్ టెస్టు ఓపెనింగ్‌పై అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రేపట్నుంచి సఫారీలతో విశాఖలో జరుగనున్న తొలి టెస్టులో మయాంక్ అగర్వాల్‌తో కలిసి రోహిత్ ఇన్నింగ్స్ ఆరంభిస్తాడు.
Comments
Please login to add a commentAdd a comment