రోహిత్ రికార్డును బద్దలు కొట్టలేరు: కోహ్లి | Rohit's record won't be broken anytime soon, says Virat Kohli | Sakshi
Sakshi News home page

రోహిత్ రికార్డును బద్దలు కొట్టలేరు: కోహ్లి

Published Thu, Nov 13 2014 10:15 PM | Last Updated on Sat, Sep 2 2017 4:24 PM

రోహిత్ రికార్డును బద్దలు కొట్టలేరు: కోహ్లి

రోహిత్ రికార్డును బద్దలు కొట్టలేరు: కోహ్లి

కోల్కతా: రోహిత్ శర్మ నెలకొల్పిన వన్డే ప్రపంచ రికార్డును సమీప భవిష్యత్ లో ఎవరూ బద్దలుకొట్టలేరని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అభిప్రాయపడ్డాడు. శ్రీలంకతో జరిగిన నాలుగో వన్డేలో రోహిత్ శర్మ 264 పరుగులు చేసి వరల్డ్ రికార్డు సృష్టించాడు. తనదైన రోజున రోహిత్ ను ఆపడం ఎవరి తరం కాదని తాజా ఇన్నింగ్స్ రుజువు చేసిందని మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లి అన్నాడు.

రోహిత్ చాలా ప్రమాదకరమైన ఆటగాడని మ్యాచ్ ముందురోజు జరిగిన విలేకరుల సమావేశంలో కోహ్లి గుర్తు చేశాడు. రోహిత్ ప్రపంచ రికార్డు సృష్టించిన రోజున అతడితో కలిసి తాను బ్యాటింగ్ చేశానని భవిష్యత్ లో తన పిల్లలతో చెప్పుకునేలా ఈ రోజు ఇన్నింగ్స్ ఉందని కోహ్లి వ్యాఖ్యానించాడు. రోహిత్ కలిసి బ్యాటింగ్ చేయడం సంతోషం కలిగించిందన్నాడు. రాంచీలో జరగనున్న ఐదో వన్డేను తేలిగ్గీ తీసుకోబోమని స్పష్టం చేశాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement