13 ఇన్నింగ్స్ల తరువాత.. | ross taylor gets an half century at home | Sakshi
Sakshi News home page

13 ఇన్నింగ్స్ల తరువాత..

Published Mon, Nov 28 2016 10:35 AM | Last Updated on Mon, Sep 4 2017 9:21 PM

13 ఇన్నింగ్స్ల తరువాత..

13 ఇన్నింగ్స్ల తరువాత..

హామిల్టన్:ఇటీవల కాలంలో ఫామ్ కోసం తంటాలు పడుతున్న న్యూజిలాండ్ వెటరన్ ఆటగాడు రాస్ టేలర్ ఎట్టకేలకు తిరిగి గాడిలో పడ్డాడు. తాజాగా పాకిస్తాన్తో జరుగుతున్న చివరిదైన రెండో టెస్టు సెకండ్ ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ సాధించాడు. టేలర్ 82 బంతుల్లో ఏడు ఫోర్ల సాయంతో అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు.

 

అంతకుముందు వరుస 11 ఇన్నింగ్స్ల్లో టేలర్కు ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు చేయకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా,  స్వదేశంలో 13 ఇన్నింగ్స్ల తరువాత టేలర్ కు ఇది తొలి హాఫ్ సెంచరీ. ఒకవైపు కంటి దృష్టి లోపంతో బాధపడుతున్న టేలర్కు ఇది కచ్చితంగా ఉపశమనం కల్గించే ఇన్నింగ్సే. కాగా, ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేసే క్రమంలో టేలర్ చేతికి బంతికి బలంగా తగలడంతో గాయమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement