
న్యూఢిల్లీ:టీమిండియాతో జరుగనున్న మూడు టీ 20ల సిరీస్ న్యూజిలాండ్ వెటరన్ ఆటగాడు రాస్ టేలర్ కు అనూహ్యంగా చోటు దక్కింది. ఇటీవల ముగిసిన వన్డే సిరీస్ లో రాణించిన టేలర్ ను టీ 20 సిరీస్ కు సైతం జట్టులోకి తీసుకుంటున్నట్లు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. న్యూజిలాండ్ లెగ్ స్పిన్నర్ టాడ్ ఆస్ట్లే స్థానంలో టేలర్ ను జట్టులో తీసుకున్నారు. బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ తో జరిగిన వార్మప్ మ్యాచ్ లో ఆస్ట్లే గాయపడ్డాడు. దాంతో అతను టీ 20 సిరీస్ కు దూరం కావాల్సి వచ్చింది.
అయితే టీ 20ల్లో టేలర్ కు చోటు దక్కడం దాదాపు ఏడాదిన్నర తరువాత ఇదే తొలిసారి. గతేడాది మార్చి తరువాత టేలర్ టీ 20 మ్యాచ్ ఆడలేదు. కాగా, వన్డే సిరీస్ టేలర్ ఫామ్ ను పరిగణలోకి తీసుకున్న కివీస్ సెలక్టర్లు.. అతన్ని టీ 20 సిరీస్ కు ఎంపిక చేసేందుకు ఎంపికకు మొగ్గు చూపారు.
కివీస్ టీ 20 జట్టు: కేన్ విలియమ్సన్(కెప్టెన్), మిచెల్ సాంత్నార్, ఇష్ సోథీ, టిమ్ సౌథీ, రాస్ టేలర్, ట్రెంట్ బౌల్ట్, టామ్ బ్రూస్, గ్రాండ్ హోమ్, మార్టిన్ గప్టిల్, మ్యాట్ హెన్రీ, టామ్ లాథమ్, హెన్రీ నికోలస్, ఆడమ్ మిల్నే, కొలిన్ మున్రీ, గ్లెన్ ఫిలిప్స్
Comments
Please login to add a commentAdd a comment