విరాట్‌ వచ్చాడు.. క్రిస్‌ గేల్‌ కూడా | Royal Challengers Bangalore vs Mumbai Indians match, Virat Kohli returns | Sakshi
Sakshi News home page

విరాట్‌ వచ్చాడు.. క్రిస్‌ గేల్‌ కూడా

Published Fri, Apr 14 2017 3:57 PM | Last Updated on Tue, Sep 5 2017 8:46 AM

విరాట్‌ వచ్చాడు.. క్రిస్‌ గేల్‌ కూడా

విరాట్‌ వచ్చాడు.. క్రిస్‌ గేల్‌ కూడా

బెంగళూరు: ఐపీఎల్‌-2017 సీజన్‌లో బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ పునరాగనమం చేశాడు. ఫిట్‌నెస్‌ లేమి కారణంగా మునుపటి మ్యాచ్‌లకు దూరంగా ఉన్న కోహ్లీ.. శుక్రవారం ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బరిలో దిగాడు. అలాగే బెంగళూరు స్టార్‌ క్రికెటర్‌ విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ క్రిస్‌ గేల్‌ ఈ మ్యాచ్‌లో​ ఆడుతున్నాడు.

టాస్‌ గెలిచిన ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. ముంబై జట్టులో మలింగ స్థానంలో సౌతీని తుది జట్టులోకి తీసుకున్నారు. బెంగళూరు జట్టులో వాట్సన్‌ను పక్కన పెట్టగా, బద్రీ, గేల్‌ వచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement