చెపాక్: ఐపీఎల్‌లో భాగంగా మంగళవారం ఇక్కడ చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు ఆండ్రీ రసెల్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన రసెల్ 36 బంతుల్లో 11 సిక్సర్లు, 1 ఫోర్‌తో 88 పరుగులు సాధించి చివరి వరకూ అజేయంగా నిలిచాడు. అయితే రసెల్ కొట్టిన 10 సిక్సర్లు ఒక ఎత్తయితే, బ్రేవో వేసిన ఓవర్‌లో కొట్టిన ఒక సిక్స్ మాత్రం మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. 17 ఓవర్ రెండో బంతికి రసెల్ భారీ సిక్సర్ కొట్టాడు. అది స్టేడియాన్ని దాటుకుని బయటపడింది. ఈ సీజన్‌లో ఇదే లాంగెస్ట్ సిక్స్‌గా నిలవడం మరొక విశేషం.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ 89 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరుణంలో బ్యాటింగ్‌కు వచ్చిన రసెల్ తన బ్యాటింగ్‌లో పవర్ చూపించాడు. ప్రధానంగా మ్యాచ్ చివర్లో రసెల్ మరింత ప్రమాదకరంగా మారిపోయాడు. వరుసగా సిక్సర్ల కొడుతూ స్టేడియాన్ని హోరెత్తించాడు. కేకేఆర్ కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ తరుణంలో రసెల్ చెలరేగి ఆడాడు. 26 బంతుల్లో 1 ఫోర్, 6 సిక్సర్లతో హాఫ్ సెంచరీ సాధించిన రసెల్.. ఆపై మరింత దూకుడుగా ఆడాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రసెల్.. వచ్చీ రావడంతోనే బ్యాట్‌కు పనిచెప్పాడు. ప్రధానంగా బంతిని బౌండరీ దాటించి చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించాడు.
Comments
Please login to add a commentAdd a comment