మాంచెస్టర్ : ప్రపంచకప్‌లో టీమిండియా సెమీస్‌లోనే ఓడిపోవడం తీవ్ర నిరాశకు గురిచేసిందని లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ పేర్కొన్నాడు. అయితే భారీ ఓటమి నుంచి తప్పించిన రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనిలపై ప్రశంసల జల్లు కురిపించాడు. ‘ధోని క్రీజులో ఉన్నంత సేపు మ్యాచ్ టీమిండియా కంట్రోల్‌లోనే ఉంది. స్ట్రైక్ రొటేట్ చేస్తూ జడేజాతో హిట్టింగ్ చేపించాడు. జడేజా కెరీర్‌లోనే బెస్ట్ ఇన్నింగ్స్‌గా ఇది నిలిచిపోతుంది. వీర్దిదరూ ఏడో వికెట్‌కు 116 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి విజయానికి బాటలు వేశారు. కానీ చివర్లో తడబాటుకు గురవడంతో ఓటమి పాలైంది.
అయితే ఐదో స్థానంలో హార్దిక్ పాండ్యా బదులు ధోని బ్యాటింగ్‌కు రావాల్సింది. ధోని ఎక్కువ సేపు బ్యాటింగ్ చేసుంటే ఫలితం మరోలా ఉండేది. ఈ విషయంలో మేనేజ్‌మెంట్ పొరపాటు చేసిందని బావిస్తున్నా’అంటూ సచిన్ పేర్కొన్నాడు. ఇక న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్ పోరులో టీమిండియా 18 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. టీమిండియా ఓటమిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు సానుభూతి వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు ఆటగాళ్ల వైఫల్యంపై మండిపడుతున్నారు. ఇక ఆదివారం కివీస్ రెండో సెమీఫైనల్ విజేతతో ప్రపంచ ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.
చదవండి:
లక్షలాది గుండెలు పగిలాయి
మంజ్రేకర్ ఇప్పుడేమంటావ్?
కొంపముంచిన ధోని రనౌట్!
Comments
Please login to add a commentAdd a comment