ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్తగా క్రికెట్ సలహా కమిటీని ఏర్పాటు చేసింది. క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, సౌరభ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్లను సభ్యులుగా నియమించారు. బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా వీరిని నియమించినట్టు బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ ఓ ప్రకటనలో తెలిపారు. వీరి నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని వెల్లడించారు.
సలహాదారులుగా పనిచేసేందుకు సచిన్, గంగూలీ, లక్ష్మణ్ సంసిద్ధత వ్యక్తం చేశారు. భారత్ క్రికెట్ పురోగతి, భవిష్యత్ సవాళ్లకు సంబంధించి దిగ్గజ త్రయం.. బోర్డు, జట్టుకు తగిన సలహాలు అందిస్తారు. స్వదేశంలోనూ, విదేశీ గడ్డపైనా జరిగే సిరీస్లకు భారత క్రికెట్ జట్టు ప్రాక్టీస్ చేయడానికి మార్గనిర్దేశం చేయనున్నారు. దేశవాళీ క్రికెట్ పురోభివృద్దికి చర్యలు తీసుకోనున్నారు. సచిన్, గంగూలీ, లక్ష్మణ్ మార్గదర్శకత్వంలో భారత్ జట్టు అత్యున్నత స్థాయికి చేరుతుందని బీసీసీఐ చీఫ్ దాల్మియా విశ్వాసం వ్యక్తం చేశారు.
బోర్డు సలహాదారులుగా సచిన్, గంగూలీ, లక్ష్మణ్
Published Mon, Jun 1 2015 3:35 PM | Last Updated on Sun, Sep 3 2017 3:03 AM
Advertisement