వరద బాధితులకు సచిన్ భారీ సహాయం!
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ మరోసారి దేశ ప్రజలను ఆకట్టుకున్నారు. ఈసారి బ్యాట్ తో కాకుండా హృదయంతో ప్రజలకు చేరువయ్యారు. వరదలతో ముంచెత్తిన జమ్మూ,కాశ్మీర్ ప్రజలకు బాసటగా నిలిచేందుకు నిర్ణయం తీసుకున్నారు.
వరద భాదితులకు ఐదు టన్నుల తినుభండారాలు, కప్పుకోవడానికి 1000 బ్లాంకెట్లుతోపాటు మరికొంత విలువైన వస్తువులను పంపించారు. జమ్మూ ప్రజలకు సహాయం అందించేందుకు శనివారం రెండు ట్రక్కులు ముంబై నుంచి వెళ్లాయి. ఈ విషయాన్ని కాశ్మీర్ అధికారి రంజిత్ కల్రా వెల్లడించారు.
పదివేల మందికి తాగునీరు అందించేందుకు 400 వాటర్ ఫిల్టర్లు, లక్ష క్లోరిన్ టాబ్లెట్లు, ఐదు టన్నుల ఆహార పదార్థాలు, కూరగాయలు పంపారని అధికారులు తెలిపారు.