Jammu and Kashmir floods
-
వరద బాధితులకు సచిన్ భారీ సహాయం!
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ మరోసారి దేశ ప్రజలను ఆకట్టుకున్నారు. ఈసారి బ్యాట్ తో కాకుండా హృదయంతో ప్రజలకు చేరువయ్యారు. వరదలతో ముంచెత్తిన జమ్మూ,కాశ్మీర్ ప్రజలకు బాసటగా నిలిచేందుకు నిర్ణయం తీసుకున్నారు. వరద భాదితులకు ఐదు టన్నుల తినుభండారాలు, కప్పుకోవడానికి 1000 బ్లాంకెట్లుతోపాటు మరికొంత విలువైన వస్తువులను పంపించారు. జమ్మూ ప్రజలకు సహాయం అందించేందుకు శనివారం రెండు ట్రక్కులు ముంబై నుంచి వెళ్లాయి. ఈ విషయాన్ని కాశ్మీర్ అధికారి రంజిత్ కల్రా వెల్లడించారు. పదివేల మందికి తాగునీరు అందించేందుకు 400 వాటర్ ఫిల్టర్లు, లక్ష క్లోరిన్ టాబ్లెట్లు, ఐదు టన్నుల ఆహార పదార్థాలు, కూరగాయలు పంపారని అధికారులు తెలిపారు. -
ఒక్కో ఎమ్మెల్యే రూ. 20 లక్షల విరాళం
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ వరద బాధితులను ఆదుకునేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) శాసనసభ్యులు ముందుకు వచ్చారు. వరద బాధితుల సహాయనిధికి ఒక్కొక్కరూ రూ. 20 లక్షల చొప్పున విరాళం ఇవ్వాలని నిర్ణయించారు. మొత్తం రూ.5.40 కోట్లు విరాళంగా అందజేయాలని పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని సీనియర్ నాయకుడు మనిష్ సిసోడియా తెలిపారు. ప్రకృతి విపత్తుల బాధితులను ఆదుకునేందుకు ఒక ఎడాదిలో రూ.35 లక్షలు మంజూరు చేసేందుకు 2012 నుంచి మార్గదర్శకాలున్నామని వివరించారు. కాగా, వరద బాధితుల కోసం పార్టీ తరపున సహాయ సామాగ్రిని సేకరించనున్నామని వెల్లడించారు. -
తెలుగువారిని రప్పించండి: కేసీఆర్, బాబు
హైదరాబాద్: భారీ వర్షాలు వరదలతో జమ్మూకాశ్మీర్ అతలాకుతలం అవుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న తెలుగువారిని స్వస్థలాలకు రప్పించేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు సమయాత్తమయ్యాయి. అందుకు సంబంధించిన చర్యలు వెంటనే చేపట్టాలని ఇరు రాష్ట్రాల సీఎం కేసీఆర్, చంద్రబాబు సంబంధిత ఉన్నతాధికారులను ఆదేశించారు. దాంతో జమ్మూ కాశ్మీర్ వరదల్లో చిక్కుకున్న వారిని రప్పించేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. అయితే కాశ్మీర్ వరదల్లో చిక్కుకున్న ఇరు రాష్ట్రాలకు చెందిన మొత్తం 36 మంది ఎన్ఐటీ విద్యార్థులు ఇప్పటికే లేహ్ నుంచి ఢిల్లీకి తరలించారు. అక్కడి నుంచి వారిని స్వస్థలాలకు తరలించేందుకు ఢిల్లీలోని ఉన్నతాధికారులు ఇప్పటికే సర్వం సిద్ధం చేశారు.