
ఒక్కో ఎమ్మెల్యే రూ. 20 లక్షల విరాళం
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ వరద బాధితులను ఆదుకునేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) శాసనసభ్యులు ముందుకు వచ్చారు. వరద బాధితుల సహాయనిధికి ఒక్కొక్కరూ రూ. 20 లక్షల చొప్పున విరాళం ఇవ్వాలని నిర్ణయించారు. మొత్తం రూ.5.40 కోట్లు విరాళంగా అందజేయాలని పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని సీనియర్ నాయకుడు మనిష్ సిసోడియా తెలిపారు.
ప్రకృతి విపత్తుల బాధితులను ఆదుకునేందుకు ఒక ఎడాదిలో రూ.35 లక్షలు మంజూరు చేసేందుకు 2012 నుంచి మార్గదర్శకాలున్నామని వివరించారు. కాగా, వరద బాధితుల కోసం పార్టీ తరపున సహాయ సామాగ్రిని సేకరించనున్నామని వెల్లడించారు.