
తెలుగువారిని రప్పించండి: కేసీఆర్, బాబు
హైదరాబాద్: భారీ వర్షాలు వరదలతో జమ్మూకాశ్మీర్ అతలాకుతలం అవుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న తెలుగువారిని స్వస్థలాలకు రప్పించేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు సమయాత్తమయ్యాయి. అందుకు సంబంధించిన చర్యలు వెంటనే చేపట్టాలని ఇరు రాష్ట్రాల సీఎం కేసీఆర్, చంద్రబాబు సంబంధిత ఉన్నతాధికారులను ఆదేశించారు.
దాంతో జమ్మూ కాశ్మీర్ వరదల్లో చిక్కుకున్న వారిని రప్పించేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. అయితే కాశ్మీర్ వరదల్లో చిక్కుకున్న ఇరు రాష్ట్రాలకు చెందిన మొత్తం 36 మంది ఎన్ఐటీ విద్యార్థులు ఇప్పటికే లేహ్ నుంచి ఢిల్లీకి తరలించారు. అక్కడి నుంచి వారిని స్వస్థలాలకు తరలించేందుకు ఢిల్లీలోని ఉన్నతాధికారులు ఇప్పటికే సర్వం సిద్ధం చేశారు.