ముంబై: సచిన్ టెండూల్కర్‌కు ముంబై క్రికెట్ అసోసియేషన్ నవంబర్ 11న సన్మానం చేయనుంది. సచిన్ టెండూల్కర్ ముంబై క్రికెట్ కు చేసిన సేవలు గాను కొత్త నిర్మిస్తున్న భవనానికి ‘కండివీలి క్లబ్‌హౌజ్ సచిన్ పేరును పెడుతున్నారు. ఈ భవనం ఆవిష్కరణ కార్యక్రమం వచ్చే నెల 11న జరుగుతుంది. అదే రోజు సచిన్‌కు సన్మానం జరపాలని నిర్ణయించారు. కోల్‌కతా నుంచి ముంబైలో అడుగుపెట్టే భారత్, వెస్టిండీస్ జట్లు నేరుగా ఈ కార్యక్రమానికి హాజరై ఆ తర్వాత తమ హోటళ్లకు వెళతాయి.
మహారాష్ర్ట ముఖ్యమంత్రి పృధ్వీరాజ్ చౌహాన్, బోర్డు అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్, ఇతర అధికారులు, ముంబైకి చెందిన మాజీ ఆటగాళ్లు కూడా పాల్గొంటారు. అలాగే 14న ఆరంబమయ్యే రెండో టెస్టు మ్యాచ్ జరిగే పది నిమిషాల ముందు బీసీసీఐ కూడా సచిన్‌ను సన్మానించనుంది’ అని ఎంసీఏ అధ్యక్షుడు శరద్ పవార్ అన్నారు. భారత్-వెస్టిండీస్ ల మధ్య నవంబరు 6వ తేదీన తొలి టెస్టు జరగనుంది.