తుది జట్టును15 మందితో ఆడించండి | Sachin Tendulkar's advice to MCA: Make school ties 15-players-a-side affair to increase talent pool | Sakshi
Sakshi News home page

తుది జట్టును15 మందితో ఆడించండి

Published Wed, Dec 4 2013 1:15 AM | Last Updated on Sat, Sep 2 2017 1:13 AM

తుది జట్టును15 మందితో ఆడించండి

తుది జట్టును15 మందితో ఆడించండి

ముంబై: మరింత మంది నాణ్యమైన క్రికెటర్లు వెలుగులోకి రావాలంటే జట్టులో 11 మందికి బదులు 15 మందితో ఆడించాలని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ)కు సూచించాడు. ఎంసీఏ ఆధ్వర్యంలో మంగళవారం సచిన్‌కు సన్మానం జరిగింది. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ ఇంటర్ కాలేజి, ఇంటర్ స్కూల్ పోటీల్లో ఎంసీఏ తమ తుది జట్టులోని ఆటగాళ్ల సంఖ్యను పెంచాల్సిందిగా సూచించాడు. ‘ప్రత్యర్థి జట్లపై ముంబై క్రికెట్ ఎలా ఆధిక్యం సాధించాలనే అంశంపై నేను, మా అన్నయ్య ఓ సారి చర్చించుకున్నాం.
 
 ఆ సందర్భంగానే ఈ ఆలోచన వచ్చింది. ఇంటర్ స్కూల్, ఇంటర్ కాలేజి మ్యాచ్‌ల్లో 11 మందికి బదులుగా 15 మందితో ఆడించాలి. ప్రతీ ఆటగాడు మ్యాచ్ ఆడేందుకే ఇంటి నుంచి బయల్దేరుతాడు. కానీ జట్టులో చోటు దొరుకుతుందా లేదా అనే అనుమానం ఉంటుంది. ఈ కొత్త ఆలోచనను అమల్లోకి తెచ్చి ప్రతీ ఆటగాడికి ఆడే అవకాశాన్ని కల్పిస్తే ముందు ఎంసీఏ లాభపడుతుంది’ అని మాస్టర్ అన్నాడు. అయితే ఈ విషయాన్ని తన కొడుకు అర్జున్ టెండూల్కర్‌ను దృష్టిలో ఉంచుకుని చె ప్పడం లేదని సచిన్ స్పష్టం చేశాడు. గతేడాది ముంబై అండర్-14 జట్టులో అర్జున్ సభ్యుడుగా ఉన్నాడు.
 
 భారతరత్నపై పిల్ కొట్టివేత
 చెన్నై: సచిన్ టెండూల్కర్‌కు భారతరత్న ఇవ్వడాన్ని నిరసిస్తూ దాఖలైన పిల్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. గత నెల 29న న్యాయవాది కనకసబై ఈమేరకు కోర్టుకెక్కారు. నిబంధనలకు విరుద్ధంగా క్రీడాకారులకు ఈ అవార్డును అందజేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఇటీవలే ఈ అత్యున్నత అవార్డు కోసం క్రీడాకారుల పేర్లను కూడా పరిగణలోకి తీసుకోవచ్చని రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసినట్టు కేంద్ర ప్రభుత్వం కోర్టుకు నివేదించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement