ముంబై: చివరి టెస్టు ఆడనున్న క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్‌కు ఘనంగా వీడ్కోలు చెప్పేందుకు ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) వినూత్న రీతిలో ఏర్పాట్లు చేస్తోంది. టెండూల్కర్ ముఖచిత్రంతో ఓ పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేయాలని ఎంసీఏ గురువారం నిర్ణయించింది. సచిన్ 200వ టెస్ట్ మ్యాచ్ ప్రారంభానికి ముందే వాంఖేడే స్టేడియంలో ఈ స్టాంపును ఆవిష్కరించనున్నారు. ఇక ఈ మ్యాచ్‌కు ముందు టాస్ కోసం ప్రత్యేక నాణేన్ని వినియోగించనున్నారు. దీనిని ఎంసీఏ జాగ్రత్తగా పదిలపర్చనుంది. అంతేగాకుండా సచిన్ గురించి ప్రముఖ క్రీడాకారులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు చెప్పిన మాటలతోపాటు సచిన్ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే సూక్తులతో 64 పేజీల ఓ బ్రోచర్‌ను కూడా విడుదల చేయనుంది.
పరిమిత సంఖ్యలో విడుదల చేయనున్న ఈ బ్రోచర్లను, నాణేలను ఎంసీఏ, బీసీసీఐ ప్రతినిధులకు అందజేయనున్నారు. ఇక సచిన్ చివరిసారిగా ఆడనున్న ఈ టెస్ట్ మ్యాచ్ జరిగే ఐదురోజులపాటు రోజుకు 10,000 సచిన్ ఫేస్ మాస్క్‌లను, సచిన్ ముఖచిత్రంతో కూడిన 10,000 స్కోర్ కార్డులను, సచిన్ పేరు రాసి ఉన్న 10,000 టోపీలను ప్రేక్షకులకు ఇవ్వనున్నారు. మ్యాచ్ జరిగే స్టేడియంలోని ప్రతి స్టాండ్‌లోనూ సచిన్‌కు సంబంధించిన అరుదైన ఫోటోలను ఏర్పాటు చేయనున్నారు.
సచిన్ వీడ్కోలుకు ఎంసీఏ ఘనంగా ఏర్పాట్లు
Published Thu, Oct 31 2013 11:59 PM | Last Updated on Sat, Sep 2 2017 12:10 AM
Advertisement
Advertisement