సాయి దేదీప్యకు డబుల్స్ టైటిల్ | sai dedeepya gets doubles title | Sakshi
Sakshi News home page

సాయి దేదీప్యకు డబుల్స్ టైటిల్

Published Sun, Jan 8 2017 10:20 AM | Last Updated on Tue, Sep 5 2017 12:45 AM

sai dedeepya gets doubles title

సాక్షి, హైదరాబాద్: నేషనల్ సిరీస్ అండర్-16 టెన్నిస్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ అమ్మారుు వై. సారుు దేదీప్య సత్తా చాటింది. కావలిలో జరుగుతోన్న ఈ టోర్నీలో డబుల్స్ విభాగంలో టైటిల్‌ను గెలుచుకున్న దేదీప్య... సింగిల్స్ విభాగంలో రన్నరప్‌గా నిలిచింది.

 

శనివారం జరిగిన బాలికల డబుల్స్ ఫైనల్లో దేదీప్య (తెలంగాణ)-భక్తి పర్వాని (గుజరాత్) ద్వయం 6-1, 7-5తో ముబషిరా-ధారణ జంటపై గెలిచి విజేతగా నిలిచింది. సింగిల్స్ ఫైనల్లో సాయి దేదీప్య 4-6, 3-6తో ధారణ చేతిలో పరాజయం పాలై రెండో స్థానంలో నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement