సైనా గెలిచినా... | Saina Nehwal routs opponent but Hyderabad still lose to Delhi | Sakshi
Sakshi News home page

సైనా గెలిచినా...

Published Sun, Aug 18 2013 1:12 AM | Last Updated on Fri, Sep 1 2017 9:53 PM

సైనా గెలిచినా...

సైనా గెలిచినా...

లక్నో: భారత నంబర్‌వన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ అలవోకగా విజయం సాధించినా... ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్)లో పీవీపీ హైదరాబాద్ హాట్‌షాట్స్ (హెచ్‌హెచ్)కు పరాజయం తప్పలేదు. శనివారం జరిగిన లక్నోలో జరిగిన మ్యాచ్‌లో క్రిష్ ఢిల్లీ స్మాషర్స్ (కేడీఎస్) 3-2తో హైదరాబాద్ జట్టుపై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్ తొలి మ్యాచ్‌లో తనోంగ్‌సాక్ (హెచ్‌హెచ్) 19-21, 21-19, 11-7తో ఏపీ రైజింగ్ స్టార్ సాయి ప్రణీత్ (కేడీఎస్)పై నెగ్గాడు. మహిళల సింగిల్స్‌లో సైనా (హెచ్‌హెచ్) 21-6, 21-8తో అరుంధతి పంత్‌వానే (కేడీఎస్)ను ఓడించడంతో హైదరాబాద్ 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 
 
 అయితే పురుషుల డబుల్స్‌లో కేడీఎస్ జోడి బూన్ హోయాంగ్ టాన్-కియాన్ కీట్ కూ 21-14, 21-20తో షెమ్ గో-తరుణ్ కోనా (హెచ్‌హెచ్)లపై గెలిచి ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది. పురుషుల రెండో సింగిల్స్‌లో డారెన్ లియూ (కేడీఎస్) 21-10, 21-7తో తౌఫిక్ హిదాయత్ (హెచ్‌హెచ్)పై; మిక్స్‌డ్ డబుల్స్‌లో దిజు-ప్రజక్తా సావంత్ (కేడీఎస్) 21-20, 21-15తో షెమ్ గో-ప్రద్య్నా గాద్రె (హెచ్‌హెచ్)పై గెలిచి 3-2తో జట్టుకు విజయాన్ని అందించారు. అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్న ప్రజక్తా సావంత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద టై’ అవార్డు లభించింది. 
 
 ఐబీఎల్‌లో నేడు
  అవధ్ వారియర్స్  x బంగా బీట్స్
 రాత్రి గం. 8 నుంచి ఈఎస్‌పీఎన్‌లో లైవ్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement