సింధు x సైనా | Saina Nehwal sets up final clash with PV Sindhu at India GP Gold badminton | Sakshi
Sakshi News home page

సింధు x సైనా

Published Sun, Jan 26 2014 1:25 AM | Last Updated on Sat, Sep 2 2017 3:00 AM

సింధు x సైనా

సింధు x సైనా

ఫైనల్స్ మ.గం.2.00 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్షప్రసారం
 లక్నో: గత ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్‌లో సైనా, సింధుల మధ్య మ్యాచ్ జరిగింది. అందులో సైనా గెలిచింది. కాకతాళీయమే అయినా... గణతంత్ర దినోత్సవం రోజున మళ్లీ ఈ ఇద్దరి మధ్య మ్యాచ్ జరగబోతోంది.
 
 ఈ సారి ఇండియా గ్రాండ్ ప్రి ఫైనల్లో ఈ ఇద్దరూ తలపడుతున్నారు. శనివారం జరిగిన ఈ టోర్నీ మహిళల సింగిల్స్ సెమీస్‌లో టాప్‌సీడ్ సైనా 21-14, 17-21, 21-19తో ఆరోసీడ్ జువాన్ డెంగ్ (చైనా)పై నెగ్గగా; రెండోసీడ్ సింధు 21-6, 12-21, 21-17తో నాలుగోసీడ్ లిండ్‌వెని పెనెట్రీ (ఇండోనేసియా)ను ఓడించింది.
 
  పురుషుల సెమీస్‌లో ఆరోసీడ్ కె.శ్రీకాంత్ 21-18, 22-20తో ఏడోసీడ్ హెచ్.ఎస్.ప్రణయ్ (భారత్)పై నెగ్గి ఫైనల్లోకి ప్రవేశించాడు. మరో సెమీస్‌లో ఆదిత్య ప్రకాశ్ 10-21, 7-21తో జు సంగ్ (చైనా) చేతిలో ఓడాడు. పురుషుల డబుల్స్ సెమీస్‌లో ప్రణవ్ చోప్రా-అక్షయ్ దివాల్కర్ 18-21, 15-21తో లి జున్హ్-లి యుచెన్ (చైనా) చేతిలో పరాజయం చవిచూశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement