విజృంభించిన క ళ్యాణ్ సాత్విక్ | saint joseph high school kalyan swathik took seven wickets | Sakshi
Sakshi News home page

విజృంభించిన క ళ్యాణ్ సాత్విక్

Published Thu, Nov 7 2013 12:05 AM | Last Updated on Sat, Sep 2 2017 12:20 AM

saint joseph high school kalyan swathik took seven wickets

జింఖానా, న్యూస్‌లైన్: సెయింట్ జోసెఫ్ హైస్కూల్ (హబ్సిగూడ) బౌలర్ కళ్యాణ్ సాత్విక్ (7/7) విజృంభించాడు. దీంతో హెచ్‌సీఏ బ్రదర్ జాన్ ఆఫ్ గాడ్ అండర్-14 నాకౌట్ టోర్నీలో  బుధవారం జరిగిన మ్యాచ్‌లో సెయింట్ జోసెఫ్ హైస్కూల్ 462 పరుగుల తేడాతో పీబీ డీఏవీ పబ్లిక్ స్కూల్‌పై ఘన విజయం సాధించింది.
 
 
 తొలుత బ్యాటింగ్ చేసిన సెయింట్ జోసెఫ్.. బ్యాట్స్‌మన్ ప్రత్యూష్ (308 నాటౌట్) ట్రిపుల్ సెంచరీతో అజేయంగా నిలవడంతో నాలుగు వికెట్లకు 486 పరుగులు చేసింది. ప్రతాప్ రెడ్డి (101) సెంచరీతో కదం తొక్కాడు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన డీఏవీ పబ్లిక్ స్కూల్.. బౌలర్ కళ్యాణ్ ధాటికి 25 పరుగులకే కుప్పకూలింది.
 
 
  మరో మ్యాచ్‌లో మహేష్ విద్యాభవన్ బౌలర్ కమల్ కుమార్ చౌదరి 7 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించాడు. దీంతో ఆ జట్టు 184 పరుగుల తేడాతో కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌పై ఘన విజయం సాధించింది. మొదట బరిలోకి దిగిన మహేష్ విద్యాభవన్ 243 పరుగుల వద్ద ఆలౌటైంది. అజయ్ సింగ్ (44), కమల్ చౌదరి (39), ఓంకార్ గుంజల్ (35) మెరుగ్గా ఆడారు. కృష్ణవేణి స్కూల్ బౌలర్ గౌరీశంకర్ 3 వికెట్లు చేజిక్కించుకున్నాడు. తర్వాత బ్యాటింగ్ చేసిన కృష్ణవేణి స్కూల్ 59 పరుగులకే ఆలౌటైంది.
 
 ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
 ప్రోగ్రెసివ్ హైస్కూల్: 52 (కైలాష్ 5/14); జాన్సన్ గ్రామర్ స్కూల్: 53/4 (ఫైజల్ అలీ 3/28).  విజ్ఙాన్ విద్యాలయ: 291/7 (విష్ణువర్ధన్ 107, నిఖిల్ 108); నల్గొండ డిస్ట్రిక్ట్: 160 (హేమచంద్ర 56; సిద్ధార్థ్ 3/40, కుందన్ 4/32).  శ్రీనిధి: 188/7 (మహ్మద్ అలీ 62); సెయింట్ అల్లాయ్‌సిస్ హైస్కూల్: 190/9 (సాయి అఖిల్ 70 నాటౌట్; వినీత్ 4/40).
 వరంగల్ డిస్ట్రిక్ట్: 262/9 (నిఖిల్ రెడ్డి 31, అజయ్ 31, పవన్ 33; మహేష్ 3/12); ఫాస్టర్ బిల్లా బంగ్ హైస్కూల్: 91 (మహేష్ 44).
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement